ఆంధ్రప్రదేశ్ లో 500 దాటిన కరోనా కేసులు

ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 500 దాటింది. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఈరోజు ఉదయం వరకు నిర్వహించిన పరీక్షల్లో కొత్తగా…

ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 500 దాటింది. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఈరోజు ఉదయం వరకు నిర్వహించిన పరీక్షల్లో కొత్తగా 19 కేసులు బయటపడ్డాయి. ఈ 19 కేసులతో కలుపుకొని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 502కు చేరింది.

తాజాగా బయటపడిన 19 కేసుల్లో పశ్చిమగోదావరి జిల్లాలో 8, కర్నూల్ లో 6, గంటూరులో 4, కృష్ణా జిల్లాలో ఒక కేసు నమోదైంది. గంటూరు నుంచి ప్రతి రోజూ కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో మరో 4 కేసులు వెలుగుచూడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒకేసారి 8 కేసులు బయటపడడం కలకలం రేపింది.

ఇక రాష్ట్రంలో నమోదైన 502 కేసుల్లో 16 మంది డిశ్చార్జ్ కాగా.. 11 మంది మరణించారు. మిగతా 475 మందికి వివిధ హాస్పిటల్స్ లో చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో అనంతపురం నుంచి 2, కృష్ణా నుంచి 3, గుంటూరు నుంచి 4, కర్నూలు-నెల్లూరు నుంచి చెరొకరు ఉన్నారు.

మరోవైపు రెడ్ జోన్లలో ఎవ్వరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారుల్ని ఆదేశించారు. ఎవ్వరూ బయటకు రాకుండా చూడాలని, నిత్యావసరాల్ని ఇంటింటికి చేరవేయాలని ఆదేశించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డు లేనప్పటికీ బియ్యం కోసం వచ్చే పేదలకు రేషన్ అందించాలని, అదే సమయంలో వాళ్లతో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయించాలని సూచించారు. 

జగన్ గారే దేశంలో నెం.1 ముఖ్యమంత్రి

జగన్ కి చంద్రబాబు కి ఉన్న తేడా అదే