అరెరే.. ఒకవైపు తెలుగుదేశం వాళ్లేమో చూశారా జగన్ ముఖ్యమంత్రి కావడం వల్లనే అమరావతికి ప్రపంచ బ్యాంక్ అప్పును ఇవ్వడం ఆపేసింది అని ప్రచారం చేయడంలో బిజీగా ఉన్నారు! జగన్ వచ్చారు.. అమరావతి కూలిపోయింది.. అని లోకేష్ ట్వీటేశాడు. ఇంతకీ తాము అమరావతి ఎక్కడ కట్టారో చెబితే, జనాలు ఇప్పుడు అక్కడి శిథిలాలను అయినా చూస్తారు.
అయితే అమరావతి ఎక్కడ కట్టారో లోకేష్ చెప్పలేదు. తాము కట్టని అమరావతిని జగన్ కూల్చేస్తున్నారని ప్రచారం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు తనయుడు. ఇలాంటి ప్రచారాల విషయంలో తండ్రికి మించిపోతున్నట్టుగా ఉన్నారు లోకేష్. అయితే లోకేష్ ఎన్ని చెప్పినా ట్విట్టర్ సుద్దులే కదా!
ఆ సంగతలా ఉంటే.. ప్రపంచ బ్యాంక్ లోకేష్ కు, తెలుగుదేశం వర్గాలకు గట్టిషాకే ఇచ్చినట్టుంది. తాము అమరావతి ప్రాజెక్టుకు అప్పులు ఇవ్వకుండా ఎందుకు వైదొలిగినట్టో వివరించి చెప్పింది వరల్డ్ బ్యాంక్. అందుకు కారణం భారత కేంద్ర ప్రభుత్వమే అని ప్రపంచబ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది.
'కేంద్ర ప్రభుత్వ సూచన మేరకే ఆ ప్రాజెక్టు నుంచి వైదొలగడం జరిగింది..' అని వరల్డ్ బ్యాంక్ క్లియర్ గా మెన్షన్ చేసింది. అంతేకాదు.. ఏపీ అభ్యున్నతి విషయంలో ఇతర వ్యవహారాల్లో తమ సహకారం కొనసాగుతుందని వరల్డ్ బ్యాంక్ ప్రకటించింది.
ప్రత్యేకించి విద్య, వైద్యం వంటి రంగాల్లో తమ సహకారం కొనసాగుతుందని స్పష్టంచేసింది. ఏపీ ప్రభుత్వంతో ఈ మేరకు ఒప్పందాలు జరుగుతున్నాయని పేర్కొంది. వైద్యరంగంలో అభ్యున్నతి కోసం భారీ మొత్తం సహకారాన్ని అందించేందుకు గతనెల 27న ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా కూడా ప్రపంచ బ్యాంక్ వివరించింది.
మొత్తానికి ఏదో ప్రచారం చేసేయాలనుకున్న లోకేష్ కు మాత్రం ప్రపంచ బ్యాంక్ గట్టి ఝలక్ ఇచ్చినట్టుంది!
జగన్ ఐఏఎస్ మీటింగులో 'రిసీట్' అనే బదులు 'రిసీప్ట్' అన్నాడు..