జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక టీడీపీ హయాంలో చక్రం తిప్పిన నేతలు, అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. అవినీతి అంతానికి జగన్ పంతం పట్టడంతో అక్రమాలకు పాల్పడిన అమాత్యులంతా దిక్కులు చూస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే, చినబాబు లోకేష్ మరోఎత్తు. పేరుకు పప్పు అయినా, అవినీతి మేత మేసిన నాయకుల్లో చినబాబు స్థానం టాప్ ప్లేస్ అంటారు చాలామంది. సో.. ఆయన సీబీఐకి ఈజీగా టార్గెట్ అవుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
నిజానికి ఇలాంటి భయాలతోనే చంద్రబాబు సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు జగన్ సీబీఐకి స్వాగతం చెప్పాక.. తొలివేటు ఎవరిపై పడుతుందా అనేది సస్పెన్స్ గా మారింది. ఐటీ కారిడార్ పేరుతో, విదేశీ కంపెనీల ఒప్పందాల పేరుతో అప్పటి ఐటీశాఖ మంత్రి నారాలోకేష్ చేసిన జిమ్మిక్కులు అన్నీ ఇన్నీ కావు.
విశాఖ కేంద్రంగా ఐటీ కారిడార్ అంటూ భూపందేరం జరిపారు. స్థానిక ఉద్యోగాల బూచి చూపించి విదేశీ కంపెనీలకు రాష్ట్రవ్యాప్తంగా వందలాది ఎకరాలు కట్టబెట్టారు. ఇవన్నీ రేపు సీబీఐ ఎంక్వయిరీలో తేలబోతున్న నిజాలు. దీనికితోడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కోట్ల రూపాయల పనుల్లో అవినీతిని లోకేష్ ప్రోత్సహించినట్టు కూడా తెలుస్తోంది.
లోకేష్ హయాంలో కాంట్రాక్ట్ లు అప్పగించి ఇంకా పని మొదలుకానివి 3,640కోట్ల రూపాయల విలువైన వర్క్ లు ఉన్నాయి. ఈ పనులు రద్దు చేయాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. 25శాతం లోపు పని జరిగినవి మరో 2వేల కోట్ల రూపాయల పనులున్నాయి. వీటన్నిటినీ కొత్త ప్రభుత్వం రద్దుచేసే ఆలోచనలో ఉంది. అంటే.. ఈ కాంట్రాక్టుల కేటాయింపులన్నిట్లో అక్రమాలు జరిగాయనేది స్పష్టం అవుతూనే ఉంది.
అటు ఐటీ శాఖలోనూ, ఇటు పంచాయతీరాజ్ శాఖలోనూ.. తన చేతివాటం చూపించిన లోకేష్ త్వరలోనే విచారణ ఎదుర్కోక తప్పదని చాలామంది భావిస్తున్నారు. దీనికితోడు మంత్రి స్థాయిలో ఆయన విడుదల చేసిన రహస్య జీవోల సంఖ్య తక్కువేం కాదు. ఏ శాఖలో లేనంత స్థాయిలో అత్యథిక సంఖ్యలో చీకటి జీవోల్ని విడుదల చేశారు లోకేష్. ఇవన్నీ సీబీఐ విచారణలో నిగ్గుదేలబోతున్నాయి. ఏవావతా టీడీపీలో నారాయణ తర్వాత అవినీతి కేసుల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు లోకేష్ దే కావడం గమనార్హం.