Advertisement

Advertisement


Home > Politics - Gossip

పీకే.. సూపరెహె

పీకే.. సూపరెహె

ప్రశాంత్ కిషోర్.. వైకాపా పార్టీకి ఆ పార్టీ నేత జగన్ కు సలహాదారుడు. అయిదేళ్లపాటు అధికార సాధన కోసం వైఎస్ జగన్ ఎంతలా శ్రమించాడో, తెరవెనుక ప్రశాంత్ కిషోర్ టీమ్ అంతలా శ్రమించింది. సాధారణంగా రాజకీయ సలహాదారుడు కానీ ఆయన టీమ్ కానీ ఆఫీసులకే పరిమితం అవుతారు. కానీ ప్రశాంత్ కిషోర్ టీమ్ అన్నింటా తానై అన్నట్లు వ్యవహరించింది. జగన్ కూడా పీకే టీమ్ కు ఎనలేని ప్రయారిటీ ఇచ్చాడు. ఒక విధంగా నిర్ణయాధికారం కూడా అందించాడు.

కేవలం స్ట్రాటజీలు అందించడమే కాదు, కాపుల రిజర్వేషన్ విషయంలో బలంగా జగన్ తన అభిప్రాయం బలంగా చెప్పడంలో, బిసిలను దగ్గరకు తీయడంలో పీకే సలహా సూచనలు పక్కాగా వున్నాయి. అదే సమయంలో నియోజకవర్గాల్లో సదా సర్వేలు చేయడం, కులాల ఈక్వేషన్లు లెక్కించడం, అభ్యర్థులను నిర్ణయించడం, వారికి ఖర్చు వ్యవహారంలో ఓ పద్దతి అనేది రూపొందించడం ఇలా చాలా విషయాల్లో పీకే పాత్ర వుంది.

పీకే పాత్ర ఎంత వుందీ అంటే, చంద్రబాబు నేరుగా ప్రశాంత్ కిషోర్ ను విమర్శించే వరకు వెళ్లింది.. కులాల వారీగా రాష్ట్రాన్ని విడగొడుతున్నాడు పీకే అని చంద్రబాబు ఆరోపించారు. అయినా ప్రశాంత్ కిషోర్ వెనక్కు తగ్గలేదు. తన పని తను చేసుకుంటూ వెళ్లారు. ఎన్నికల పోలింగ్ తరువాత మాంచి పార్టీ ఇచ్చి మరీ జగన్ పీకే కు వీడ్కోలు పలికాడు. 

పీకేకు ఫీజ్ ఎంత ఇచ్చాడు? ఎన్ని కోట్లు అన్నది కాదు విషయం. జగన్ సాధించిన అద్భుత విజయంలో పీకే పాత్ర ఎంత అన్నదే పాయింట్.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను ఏపీ ముఖ్యమంత్రిగా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?