మంత్రి కన్నబాబును సెబ్బాస్ అనాల్సిందే!

అసలే కొత్త ప్రభుత్వం.. కొత్త మంత్రులు! మంత్రులు అయిన తర్వాత.. తొలిసారిగా తమ సొంత నియోజకవర్గాలకు వస్తున్నారు… ఇలాంటి సందర్భంలో ఎంత హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంత్రులు నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగగా భారీ…

అసలే కొత్త ప్రభుత్వం.. కొత్త మంత్రులు! మంత్రులు అయిన తర్వాత.. తొలిసారిగా తమ సొంత నియోజకవర్గాలకు వస్తున్నారు… ఇలాంటి సందర్భంలో ఎంత హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంత్రులు నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగగా భారీ ప్రదర్శనలు గట్రా జరిగాయి. శని, ఆదివారాల్లో వేల సంఖ్యలో పార్టీ వాళ్లు, అధికారులు.. ఇలా రకరకాలుగా అన్ని వర్గాలకు చెందినవారు వచ్చి మంత్రుల్ని కలిసి అభినందించి వెళ్లడమూ జరిగింది.

అయితే ఇలాంటి అభినందనల వ్యవహారాల్లో… వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యవహరించిన శైలి మాత్రం కొంత ప్రత్యేకంగా శెభాష్ అనదగినది. ఆయన నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా అభినించడానికి వచ్చేవాళ్లెవ్వరూ పూలబొకేలు తేవొద్దని ఆయన ముందుగానే సూచించారు. అంతగా కావలిస్తే నోటు పుస్తకాలు, మొక్కలు తెచ్చి ఇవ్వాలని కూడా సూచించారు.

అంతే మంత్రి నియోజకవర్గానికి వచ్చేసరికి అభినందించడానికి వచ్చే ప్రతివాళ్లూ నోటుపస్తకాలు తెచ్చి ఇచ్చారు. ఇలా వేల పుస్తకాలు జమ అయ్యాయి. ఈ పుస్తకాలను  నియోజకవర్గంలో పేద విద్యార్థులకు పంచేయాలని మంత్రి కన్నబాబు నిర్ణయించారు. వచ్చే అభినందనల్ని కూడా తిరిగి ప్రజలకు ఉపయోగపడేలా మార్చేసినందుకు… కన్నబాబు అభినందనీయుడే. గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పలు సందర్భాల్లో తనకు కప్పే శాలువాలు, కండువాలు లాంటివి అన్నింటినీ అనాథ, వృద్ధ శరణాలయాలకు పంచేసే వారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.

ఈ ఆలోచన మరీ కొత్తది కాకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరూ అనుసరిస్తున్నది మాత్రంకాదు. మంత్రులు ప్రతి ఒక్కరూ ఇలాగే చేయాలని పిలుపు ఇవ్వకపోవచ్చు. కానీ… వారిని అభినందించే ప్రజలే తమ ఆలోచన సరళి మార్చుకుని.. వందల రూపాయలకు పూలబొకేలు తీసుకువెళ్లి ఇవ్వడం కంటె, ఈ రకంగా తాము కలిసే పెద్దల వద్దకు… ఎవ్వరికీ ఉపయోగపడని పూలబొకే లకంటె, నోటు పుస్తకాలు, మొక్కలు వంటివి కానుకలుగా తీసుకువెళ్లే అలవాటు చేసుకుంటే… తమ వల్ల తిరిగి సమజానికి ఎంతోకొంత మంచి జరుగుతుందని తెలుసుకోవాలి.

బాబు అప్పుడే ఇలా ఆలోచించి ఉంటే ఫలితముండేదేమో!