కరోనా వైరస్ అనే మహమ్మారి లోకంలోకి చైనా ద్వారా వచ్చినప్పటినుంచి, చైనా, భారత్, పాక్ అని కాకుండా, పూర్తి భూగోళాన్నే ఒక ఆట ఆడింది. ఇంకా ఆడుతూనే ఉంది కూడా. చైనాలో దీని ద్వారా చనిపోయిన వారి సంఖ్య దాదాపు 3,042ను చేరుకుంది. మరో వైపు చూస్తే, అదే చైనాలో కరోనా వైరస్ కేసులు దాదాపు 80,552కు చేరుకున్నాయి. కోవిడ్-19 చాలా పరిశ్రమలను దెబ్బ తీస్తూ, లోకంలోనే ఒక ‘హాట్ టాపిక్’ అయింది. కరోనా గురించి లోకంలో ప్రయాణిస్తున్న నకిలీ వార్తలను నివారించడానికి వివిధ ప్రభుత్వాలు దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ పరిస్థితి ఎంత సున్నితమైన అంశంగా మారిందంటే, యూట్యూబ్ ఈ ప్రాణాంతక వ్యాధి గురించి మాట్లాడే వీడియోలను డీమానిటైజ్ చేస్తున్నట్లుగా తెలిపింది.
ఈ ప్రకటనను యూట్యూబ్ వారి ప్రాడక్ట్ మేనేజిమెంట్ డైరెక్టర్ టామ్ లూయెంగ్ క్రియేటర్ ఇన్సైడ్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రకటించారు. కొరోనా వైరస్ గురించి చర్చించే యూట్యూబ్ వీడియోలను డీమానిటైజ్ చేస్తామని లూయెంగ్ ధృవపరచాడని ది వర్జ్ అనే వార్తా వెబ్సైట్ తెలిపింది. సున్నితమైన అంశాల గురించి చర్చించే వీడియోలను డీమానిటైజ్ చేయాలనే నిర్ణయం తీసుకోవడం యూట్యూబ్ ముందు చాలా సార్లు చేసింది. కాబట్టి, ఇప్పుడు కరోనా వైరస్ గురించి వీడియోలను డీమానిటైజ్ చేయడం యూట్యూబ్‌కు కొత్తేమీ కాదు. తమ వీడియోలను డీమానిటైజేషన్ నుండి కాపాడడానికి సృష్టికర్తలు కరోనా వైరస్ అనే పదాన్ని ఉపయోగించకూడదు. అంతే కాదు, దీని గురించి ఆ పదం వాడకుండా, లోకంలో నడుస్తున్న ‘హెల్త్ ఇష్యూ’ అని చెప్పినా, లేదా పొడి అక్షరాలు వాడినా, వాళ్ల వీడియోలు డీమానిటైజ్ అవుతాయని సృష్టికర్తలు గమనించాలి.
బిగ్ టెక్ (ఆపిల్, గూగుల్, అమేజాన్, ఫేస్బుక్ వంటి కంపెనీలు) కూడా తమ ఉద్యోగులను కోవిడ్ -19 నుండి కాపాడడానికి చర్యలు తీసుకుంటోంది. అంతేకాదు, ప్రయాణ పరిమితులను చాలా కఠినంగా విధించడంతో పాటు రాబోతున్న ఈవెంట్స్ అన్నీ రద్దు చేయబడ్డాయి. ఉదాహరణకు, దీపిక ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌కు వెళ్లకుండా ఉన్నట్టే ఈ సంవత్సరం శాన్ఫ్రాన్సిస్కో లో జరగబోతున్న గేమ్ డెవెలపర్స్ ప్రోగ్రామ్‌కు తాము కరోనా వైరస్ ఆందోళనల మూలాన వెళ్లడంలేదని మైక్రోసాఫ్ట్ ఇటీవల ప్రకటించింది. అదే విధంగా, ఫేస్బుక్ తమ ఎఫ్-8 – యాన్యువల్ డెవెలపర్ సమావేశాన్ని కరోనా మూలంగానే రద్దు చేసింది.
కొరోనా వైరస్ బిగ్ టెక్ కంపెనీల రాబడిని కూడా తగ్గించేస్తోంది. ఈ మధ్యే ఆపిల్ ఈసారి తను ఆదాయ లక్ష్యాలను చేరుకోలేకపోవచ్చని తమ పెట్టుబడిదారులను హెచ్చరించింది. మొత్తానికి కొరోనా భూగోళానికి పెద్ద నష్టాన్నే తెచ్చిపెట్టింది.