కేశినేని వర్సెస్ బుద్ధా.. గొడవ ఈ నాటిది కాదు!

పార్టీ అధికారంలో ఉన్నంత సేపూ వారి మధ్యన విబేధాలు బహిర్గతం కాలేదు. 'నువ్వెంత అంటే నువ్వెంత..' అని అనుకోవడం వారి మధ్యన ముందు నుంచినే ఉంది. ఇప్పుడు ఒకరి గుట్టు మరొకరు బయటపెడుతున్నారు. ఒకరు…

పార్టీ అధికారంలో ఉన్నంత సేపూ వారి మధ్యన విబేధాలు బహిర్గతం కాలేదు. 'నువ్వెంత అంటే నువ్వెంత..' అని అనుకోవడం వారి మధ్యన ముందు నుంచినే ఉంది. ఇప్పుడు ఒకరి గుట్టు మరొకరు బయటపెడుతున్నారు. ఒకరు దొంగ పర్మిట్లతో బస్సులు నడిపిన వారని, మరొకరు కొబ్బరి చిప్పల దొంగ అని వారిద్దరూ ఒకరి గుట్టును మరొకరు బయటపెట్టుకుంటూ ఉన్నారు. ఆఖరికి 'కుక్క..' అని దూషించుకునేంత వరకూ వెళ్లింది వ్యవహారం. అయితే వారిద్దరి మధ్యన ఈ రచ్చ కొత్తది ఏమీకాదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇన్నాళ్లూ అధికారం ఉంది కాబట్టి.. ఈ గ్రూపుల గోల బయటకు రాలేదు, ఇప్పుడు బయటకు వచ్చింది అంతే తేడా అనే విశ్లేషణ ప్రముఖంగా వినిపిస్తుంది.

తెలుగుదేశం పార్టీలో రేగిన విజయవాడ రచ్చకు సంబంధించి పూర్వాపరాలు ఇలా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయవాడ మేయర్ విషయంలో ఖర్చులన్నీ ఒకవర్గం పెట్టుకుంటే దేవినేని ఉమ వర్గం కొనేరు శ్రీధర్ ను మేయర్ గా చేసింది. దుర్గగుడి ఫ్లైవోవర్ విషయంలో నిధులు కేశినేని నాని నితిన్ గడ్కరీ నుంచి సాధించుకుని వస్తే ఆయనకు ఏమాత్రం క్రెడిట్ దక్కకుండా చంద్రబాబుకు పాదాభివందనం ద్వారా వ్యవహారాన్ని డైవర్ట్ చేశారు బుద్ధా వెంకన్న. దీనివెనుక దేవినేని ఉమ ఉన్నారనేది విజయవాడ తెలుగుదేశం వారి మాట.

కాల్ మనీ –సెక్స్ రాకెట్ వ్యవహారంలో దేవినేని ఉమ అండ్ గ్యాంగ్ చిక్కుకుపోగా.. అప్పుడు నారా లోకేష్ బాబు అండదండలతో బయటపడ్డారంటారు. కేశినేని నానిని 2014 ఎన్నికల్లో ఓడించడానికే దేవినేని ఉమ గ్రూప్ గట్టిగా పని చేసిందంటారు. ఇక కేశినేని వర్గంలోని నాగుల్ మీరా విజయవాడ వెస్ట్ టికెట్ ను బీజేపీతో పొత్తు కోసం అప్పట్లోనే త్యాగం చేశారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కాల్సి ఉన్నా దాన్ని బుద్ధా వెంకన్న తన్నుకుపోయారు. అదంతా కూడా దేవినేని స్కెచ్చే అని టాక్.

బుద్ధా వెంకన్న తీరువల్ల పార్టీకి అనేక రకాలుగా నష్టమే తప్ప, అలాంటి వారి వల్ల యూజ్ లేదనేది కేశినేని వాదన. అందుకే ఆఖరికి తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించి దూషించేవరకూ వచ్చింది వ్యవహారం. కానీ బుద్ధా వెంకన్నకు చంద్రబాబు నుంచి, లోకేష్ నుంచి చాలా ప్రోత్సాహమే ఉంది. అలాంటి భజనను వారు కోరుకుంటున్నారు.

అలాగని కేశినేని నానిని వదులుకోలేరు. ఇప్పుడు ఆయనను వదులుకుంటే విజయవాడలో టీడీపీకి పుట్టగతులు ఉండకపోవచ్చు. అలాగని కేశినేని కూడా ఏ పార్టీలోకో వెళ్లిపోలేరు. ఆ విషయాన్ని ఆయనే చెప్పుకున్నారు. కాబట్టి ఇదంతా టీ కప్పులో తుఫానే! త్వరలోనే చంద్రబాబుతో ఇరు వర్గాలూ సమావేశమై.. తామంతా ఒకటే అంటూ స్టేట్ మెంట్ ఇవ్వొచ్చు. అంతవరకూ జనాలకు ఇదొక వినోదమంతే!

ప్రత్యర్థులు ఏకమై సుధీర్ విజయాన్ని ఆపలేకపోయారు