కేసీఆర్ ఒప్పుకుంటే ఉక్కు ఉద్యమంలో పాల్గొంటా

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి అనూహ్య మద్దతు లభించింది. తెలంగాణ మంత్రి, సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్, ఈ ఉద్యమానికి మద్దతిచ్చారు. కేసీఆర్ అనుమతిస్తే.. వైజాగ్ వచ్చి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో…

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి అనూహ్య మద్దతు లభించింది. తెలంగాణ మంత్రి, సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్, ఈ ఉద్యమానికి మద్దతిచ్చారు. కేసీఆర్ అనుమతిస్తే.. వైజాగ్ వచ్చి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో కలిసి ప్రత్యక్షంగా పోరాటం చేస్తానని సంచలన ప్రకటన చేశారు.

“ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు అంటూ పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ను వంద శాతం అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖలో వేలాది మంది రోడ్డున పడ్డ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు నా మద్దతు ఇస్తున్నాను. ఉద్యోగులకు మేమంతా అండగా నిలబడతాం. అవసరమైతే కేసీఆర్ ఆశీర్వాదం తీసుకొని, సీఎం అనుమతితో కొంతమంది వైజాగ్ కూడా వచ్చి ప్రత్యక్షంగా కూడా మద్దతి తెలుపుతాం.”

ఇంతకీ కేటీఆర్ ఇలా ఉన్నట్టుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు మద్దతుగా ఇలా సంచలన ప్రకటన చేయడానికి కారణం ఏంటి? ఆ కారణం ఏంటో కూడా ఆయనే చెబుతున్నారు.

“విశాఖలో ఏదో జరిగితే మాకేదో లాభం వస్తుందనుకోవద్దు. పొరుగు రాష్ట్రంలో జరుగుతున్నదాంతో మాకు సంబంధం లేదని కూర్చుంటే, తెల్లారితే మా దగ్గరకొస్తుంది. ఈరోజు విశాఖ ఉక్కు అమ్ముతున్నారు, రేపు బీహెచ్ఈఎల్ అమ్ముతారు. ఎల్లుండి సింగరేణి అమ్ముతారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని మా ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటుపరం చేస్తారు. కాబట్టి విశాఖ ఉక్కు పోరాటంలో ఉద్యోగులతో పాటు మేం కూడా కలిసుంటాం.”

ఇలా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి తన పార్టీ తరఫున పూర్తి మద్దతు ప్రకటించారు కేటీఆర్. ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ మరోసారి కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. 

రాజకీయాల్లో కేసీఆర్ అంత మేధావి లేడు

ప్రైవేటీకరించవద్దు.. నిర్ణయం మార్చుకోండి