భారత్‌లో చైనా వైరస్ ప్రవేశించడంతో దేశ వ్యాప్తంగా కలకలం రేగుతోంది. కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్ లక్షణాల్ని గుర్తించారు. ఈ విషయాన్ని భారత వైద్య పరిశోధన మండలి వెల్లడించింది. మూడు, ఎనిమిది నెలల చిన్నారులకు వైరస్ సోకినట్టు ఆ సంస్థ పేర్కొంది.
ఈ వైరస్ లక్షణాలు బయటపడిన విధానంపై కేంద్ర ఆరోగ్యశాఖ ఆసక్తికర విషయాలు చెప్పింది. దేశ వ్యాప్తంగా శ్వాసకోశ వ్యాధులపై భారత వైద్య పరిశోధన మండలి సాధారణ సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా బెంగళూరులో ఇద్దరు చిన్నారుల్లో హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు బయటపడ్డాయి.
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో శ్వాసకోశ, దగ్గు, జలుబు లక్షణాలతో భారీ సంఖ్యలో ఆస్పత్రులపాలవుతున్నట్టు వార్తలొస్తున్నాయి. గత చేదు అనుభవాల దృష్ట్యా భారత ఆరోగ్యశాఖ ముందుగానే అప్రమత్తమైంది. ఇందులో భాగంగా చేపట్టిన సాధారణ వైద్య పరీక్షల్లో వైరస్ లక్షనాలు వెలుగు చూశాయి.
మూడు నెలల చిన్నారి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యినట్టు భారత వైద్య పరిశోధన మండలి వెల్లడించింది. అలాగే 8 నెలల చిన్నారి మాత్రం చికిత్స పొందుతోంది. అయితే వైరస్‌బారిన పడిన దేశాల్లో చిన్నారి కుటుంబ సభ్యులు ప్రయాణించలేదని తెలిసింది. గతంలో కరోనాబారిన పడిన రోగులకు ఏ లక్షణాలైతే ఉన్నాయో, దాదాపు అలాంటివే ఈ వైరస్ విషయంలోనూ ఉన్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాల్సిన అవసరం ఎంతైనా వుంది.
మల్లీ కరోనా వచ్చి Lockdown చేస్తే జగోనా మోస్ట్ హ్యాపీ.. ప్యాలెస్ దాటి బైటకి రానవసరం లేదు.