దర్శకుడు రాజమౌళి కంటే పోలీసులు అద్భుతంగా కథలు అల్లుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్స్ విసిరారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా హైడ్రామా నడిచింది. కేటీఆర్ తన వెంట తీసుకెళ్లిన లాయర్‌ను పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన లాయర్‌ను ఏసీబీ కార్యాలయంలోకి అనుమతిస్తారని ఎదురు చూసిన కేటీఆర్‌కు చివరికి నిరాశే ఎదురైంది. దీంతో ఆయన వెనుతిరిగి వెళుతూ మీడియాతో మాట్లాడారు. లాయర్‌తో విచారణకు హాజరవుతుంటే పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏంటని ఆయన ప్రశ్నించారు. పోలీసులపై తనకు నమ్మకం లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. లాయరే తనకు రక్ష అన్నారాయన.
లాయర్ల సమక్షంలో విచారిస్తామని చెబితే, తాను కార్యాలయం లోపలకి వెళ్తానన్నారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆయన చురకలు అంటించారు. రాజమౌళి కంటే గొప్పగా పోలీసులు కథలు రాస్తున్నారని వెటకరించారు.
ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ లాయర్‌ను అనుమతించేది లేదని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. మరోసారి కేటీఆర్‌కు నోటీసు ఇవ్వడానికి ఏసీబీ అధికారులు నిర్ణయించారు. లాయర్ రాకుండా రావాలని ఆ నోటీసులో పేర్కొననున్నారు. ఇదిలా వుండగా ఈడీ విచారణకు మంగళవారం కేటీఆర్ హాజరు కావాల్సి వుంది. వెళ్తారో, లేదో చూడాలి.
టిళ్లు 2025 జోక్ పేల్చాడు….రాజమౌళి కధలు రాయడు…దర్శకత్వం చేస్తాడు…విజయేంద్ర ప్రసాద్ కధలు రాస్తారు
వీడు పెద్ద మేధావి లాగా ట్వీట్లు వేస్తాడు కదా, లాయర్లు లేకుండా వెళ్ళలేడా?
avi kooda layarlu chepitene vestadmo bro
Ktr honest person
good joke
అదేంది భయ్యో…అతి మంచితనం…అతి నిజాయితీ అని ఇంకొకడు చెప్పుకు తిరుగుతున్నాడుగా
Aayaaa lake trs government lo lands rates perigindhi, revanth vachina tharuvatha real estate nasanam aindhi
aa mukka valla naanna kuda nammadu
Namakam prajalu lo vundhi malli trs government vasthundhi
శ్రీ రెడ్డి holy woman
Osama bin laden శాంతి దూత
కసబ్ అత్యంత దయామయుడు
వీరప్పన్ నిజాయితీ గల బిజినెస్ మ్యాన్
ఇంకా వీరందరి గొప్పదనం కలిపితే వచ్చే ఒకే ఒక్క మగాడు మా జగన్ మాయ్య