స్టాలిన్ చ‌మ‌త్కారం, హిందీ మీడియా గ‌గ్గోలు!

తెలుగునాట గంపెడు మంది పిల్ల‌ల్ని క‌నండి అనేది పాత‌కాల‌పు ఆశీర్వాదం. ఇప్పుడైతే పాత సినిమాలు టీవీలో వేసిన‌ప్పుడు అలాంటి మాట‌లు వినిపిస్తాయి త‌ప్ప‌, తెలుగు వాళ్లు ఎప్పుడో కుటుంబ‌నియంత్ర‌ణ‌ను అమ‌ల్లో పెట్టేశారు! అది కూడా…

తెలుగునాట గంపెడు మంది పిల్ల‌ల్ని క‌నండి అనేది పాత‌కాల‌పు ఆశీర్వాదం. ఇప్పుడైతే పాత సినిమాలు టీవీలో వేసిన‌ప్పుడు అలాంటి మాట‌లు వినిపిస్తాయి త‌ప్ప‌, తెలుగు వాళ్లు ఎప్పుడో కుటుంబ‌నియంత్ర‌ణ‌ను అమ‌ల్లో పెట్టేశారు! అది కూడా త‌న ఘ‌న‌తే అంటూ చంద్ర‌బాబు చెప్పుకుంటూ ఉంటారు కానీ, 80ల‌లోనే చాలా మంది తెలుగు వాళ్లు కుటుంబ నియంత్ర‌ణ‌ను అమ‌ల్లో పెట్టారు.

ఇప్పుడు 35 యేళ్ల వ‌య‌సు ఉన్న వాళ్ల‌లో కూడా చాలా మందికి ఒక తోబుట్టువే ఉంటారు! అంటే 80ల‌లోనే మంది ఎక్కువైతే మ‌జ్జిగ ప‌ల్చ‌న అనే విష‌యాన్ని తెలుగు వారు గ్ర‌హించగ‌లిగారు. ఇదే ధోర‌ణిలో త‌మిళులు, మ‌ల‌యాళీలు కూడా ఉన్నారు. ఫ‌లితం ఏమిటంటే.. త్వ‌ర‌లో లోక్ స‌భ సీట్ల పున‌ర్విభ‌జ‌న నేప‌థ్యంలో.. ద‌క్షిణ భార‌త‌దేశంలో పెరిగే ఎంపీ సీట్ల సంఖ్య ఏమాత్రం లేకుండా పోతోంది.

తెలుగు రాష్ట్రాల్లో అయితే మూడు సీట్లు పెరుగుతాయ‌ట‌! ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ క‌లిపి .. పెరిగిన జ‌నాభా అనుస‌ర‌ణంగా మూడంటే మూడు ఎంపీ సీట్లు పెరుగుతాయ‌ట‌. త‌మిళ‌నాడు అయితే మ‌రీ రెండుకు ప‌రిమితం కానుంది. ప్ర‌స్తుతం 39 ఎంపీ సీట్లు ఉన్న త‌మిళ‌నాట ఈ సంఖ్య 41కి చేర‌నుంది. కేర‌ళ‌లో క‌నీసం ఒక్క ఎంపీ సీటు అయినా పెరుగుతుందా అనేది అనుమానమే! కుటుంబ‌నియంత్ర‌ణ పాటించిన నేరానికి ఈ రాష్ట్రాల‌కు పార్ల‌మెంట్ లో రాజ‌కీయ ప్రాధాన్య‌త త‌గ్గిపోనుంది.

అదే యూపీని తీసుకుంటే.. ఇప్పుడే అక్క‌డ 80 ఎంపీ సీట్లు ఉంటే, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అక్క‌డ సీట్ల సంఖ్య ఏకంగా 126 కు పెర‌గ‌నుంది! ఎక్క‌డ 80? ఎక్క‌డ 126? అలాగే కుటుంబ నియంత్ర‌ణ అనేదేంటో కూడా అవ‌గాహ‌ణ లేకుండా ఎడాపెడా పిల్ల‌ల్ని క‌న్నందుకు బిహార్, మ‌ధ్య‌ప్ర‌దేశ్ వంటి హిందీ బెల్ట్ ల‌లో కూడా భారీగా ఎంపీ సీట్లు పెర‌గ‌నున్నాయి. స్థూలంగా చెప్పేదేంటంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోపు ఈ పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే, ద‌క్షిణాది రాష్ట్రాల‌కు రాజ‌కీయంగా ఎలాంటి ప్రాధాన్య‌తా ఉండ‌దు!

ఏపీ, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, కేర‌ళ‌ల్లో తిప్పితిప్పి కొడితే నాలుగైదు ఎంపీ సీట్లు పెరిగితే, ఒక్క యూపీలో 46 ఎంపీ సీట్లు పెర‌గ‌బోతున్నాయి. అలాంట‌ప్పుడు ఆ ఉత్త‌రాదిన గెలిస్తే చాలు, ఇక లోక్ స‌భ‌లో తిరుగులేని ఆధిప‌త్యం చ‌లాయించ‌వ‌చ్చు. జ‌నాభా త‌ప్ప మ‌రేం లేని యూపీ, బిహార్ ల‌లో మేనేజ్ చేస్తే.. దేశ‌మంతా అధికారం. ఇక దక్షిణాదికి ఎలా గుండు కొట్టినా ఇబ్బంది లేదు! ఇలాంటి నేప‌థ్యంలో త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ కాస్త చ‌మ‌త్కారంగా ఒక వ్యాఖ్య చేసే స‌రికి హిందీ మీడియా గగ్గోలు పెడుతూ ఉంది.

రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో పెళ్లిళ్ల కార్య‌క్ర‌మంలో స్టాలిన్ మాట్లాడుతూ.. పాత‌కాలంలో 16 మంది పిల్ల‌ల్ని క‌న‌మ‌ని దీవించే వార‌ని, ఇప్పుడు మ‌ళ్లీ అదే అవ‌స‌ర‌మేమో.. ఎంపీ సీట్ల సంఖ్య పెర‌గాలంటే అని అన్నారు! ఇందులో వాస్త‌వ ప‌రిస్థితిపై వ్యంగ్య‌మే ఉంది త‌ప్ప‌, ఇబ్బ‌డిముబ్బ‌డిగా పిల్ల‌ల్నీ క‌నేమ‌యని నిర్బంధ చ‌ట్టం ఏమీ చేస్తామ‌న‌లేదు, లేదా ఉత్త‌రాదిలా మంద‌ను పెంచాల‌నీ అన‌లేదు. అయితే స్టాలిన్ అలా అనేశాడంటూ హిందీ మీడియా అస్స‌లు స‌హించ‌లేక‌పోతోంది. పిల్ల‌ల్నీ క‌న‌డానికే జ‌న్మం ఉంద‌న్న‌ట్టుగా బ‌తికే జ‌నాల‌కు, ఆ మ‌తం పెరిగిపోతోంది మ‌నం పిల్ల‌ల్ని క‌నాలి, ఈ మ‌తం పెరిగిపోతోంది మ‌నం పిల్ల‌ల్ని క‌నాల‌ని పోటీలుపెట్టుకు జ‌నాభా పెంచే చోట్ల నుంచి వ‌చ్చిన వారికి అంత‌క‌న్నా ఏం అర్థ‌మ‌వుతుందిలే!

17 Replies to “స్టాలిన్ చ‌మ‌త్కారం, హిందీ మీడియా గ‌గ్గోలు!”

  1. స్టాలిన్ చేసిన చమత్కారం కరణం జోహార్ మీద ఎవరైనా చేస్తారనా అక్కడ comments మూసేశారు? లేకుంటే GA రచయితలంతా అల్లిన pan universe కథను కరణ్ కొంటున్నాడా?

  2. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్.. అని ఊరికే చెప్పలేదు కదా…

  3. నార్త్ లో కూడా కుటుంబ నియంత్రణ తప్పనిసరిగా పాటించాలి అని చట్టం తెచ్చేలా అయితే ఈ DMK లాంటి పార్టీలు మీ జగనన్న పార్టీ సపోర్ట్ చేస్తుందా?

    1. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థ లలో పోటీ చేసే రూల్ తెస్తే నాన్ బీజేపీ ప్రభుత్వాలు ఆ రూల్ తొలగించాయి!

  4. ఇంతవరకు సౌత్ లోకసభ స్థానాల బలం లేదా ఒక రాష్ట్రం బలం చూపించి సాధించిన పనులు ఏమైనా చెప్పండి, సిక్కు రైతుల్లా మీరు ఢిల్లీ వెళ్లి కూర్చుని ఏదైనా చట్టం వెనక్కి తెచ్చేలా ఎప్పుడైనా చేసారా!

Comments are closed.