పదేళ్ల వయసుకే తొలి సంపాదన

హీరోలు, హీరోయిన్లు ఎన్ని కోట్లు సంపాదించినా మొదటి సంపాదన ఇచ్చే కిక్ వేరు. అలాంటి కిక్ దుల్కర్ కు కూడా ఉంది. ప్రస్తుతం హీరోగా ఎంత సంపాదిస్తున్నప్పటికీ, మొదటి సంపాదన మాత్రం తనకు ఎప్పటికీ…

హీరోలు, హీరోయిన్లు ఎన్ని కోట్లు సంపాదించినా మొదటి సంపాదన ఇచ్చే కిక్ వేరు. అలాంటి కిక్ దుల్కర్ కు కూడా ఉంది. ప్రస్తుతం హీరోగా ఎంత సంపాదిస్తున్నప్పటికీ, మొదటి సంపాదన మాత్రం తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందంటున్నాడు. అతడి మొదటి ఆదాయం 2వేల రూపాయలు.

“నాకు అప్పుడు పదేళ్లు. ఓ టీవీ యాడ్ లో నటించాను. అప్పుడు నాకు 2వేల రూపాయలిచ్చారు. అందులో చాలా మొత్తం నా తాతయ్య-నాన్నమ్మలకు ఇచ్చేశాను. నాకేం మిగల్లేదు.”

ఇలా తన తొలి సంపాదన వివరాల్ని బయటపెట్టాడు దుల్కర్. ‘లక్కీ భాస్కర్’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ నటుడు.. ఈ సినిమాలో ఫైట్స్ ఉండవని, కానీ చాలా కిక్ ఇస్తుందని చెబుతున్నాడు. ప్రతి ఇంట్లో భాస్కర్ లాంటి కుర్రాడు ఉంటాడని, అందుకే ‘లక్కీ భాస్కర్’ సినిమా అంగీకరించానని అన్నాడు.

ఇక తెలుగులో మల్టీస్టారర్ పై స్పందిస్తూ.. ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని, బన్నీ, రానా.. ఇలా చాలామంది హీరోలతో తను క్లోజ్ గా ఉంటానని, వాళ్లలో ఎవరితోనైనా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి తనకు ఇబ్బంది లేదని ప్రకటించాడు. చాలామంది కోరుతున్నట్టు వాళ్లలో ఒకరితో యాక్షన్ మల్టీస్టారర్ చేయడానికి రెడీ అని ప్రకటించాడు.

One Reply to “పదేళ్ల వయసుకే తొలి సంపాదన”

Comments are closed.