మహారాష్ట్ర సీఎం ఎవరనే అంశం గురించి ఎన్నికల తర్వాత మహాయుతి కూటమిలో క్లారిటీ వచ్చినట్టుగా ఉంది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఎవరి పేరు చెప్పినా సీఎంగా వారికి తన మద్దతు ఉంటుందంటూ శివసేన పక్షనేత షిండే ప్రకటించడంతో.. ఆయన బెట్టు వీడినట్టుగా స్పష్టం అయ్యింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే షిండే కాస్త సన్నాయి నొక్కులు నొక్కే ప్రయత్నం చేశారు.
మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకే సీఎం సీటు దక్కాలని ఏమీ లేదనే వ్యాఖ్య ఆయన నుంచి వినిపించింది. శివసేన చీలిక పక్షం ఎమ్మెల్యేలతో బీజేపీతో జత కట్టి సీఎం హోదాను దక్కించుకున్న షిండే , ఎన్నికల తర్వాత కూడా తనే సీఎం అనే ప్రయత్నం కాస్త చేశారు. గతంలో తనను సీఎంగా చేసిన బీజేపీ ఆ హోదాలో తననే కొనసాగిస్తుందనే ఆశలు ఆయనకు ఎక్కడో ఉన్నట్టున్నాయి. అయితే మోడీ, షాలతో మాట్లాడిన తర్వాత పూర్తి క్లారిటీ వచ్చినట్టుగా ఉంది.
ఇక దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర మహాయుతి కూటమి లెజిస్లేటివ్ లీడర్ గా ఎన్నుకోవడం లాంఛనంగా కనిపిస్తూ ఉంది. మొన్నటి వరకూ షిండేకు డిప్యూటీ ఫడ్నవీస్. అంతకు ముందు ఈయన సీఎం హోదాలో పని చేశారు. సీఎం హోదా నుంచి డిప్యూటీగా డిమోషన్. ఇప్పుడు షిండే ఈయనకు డిప్యూటీ సీఎంగా నియమితం కావడం కూడా లాంఛనమే.
షిండేకు మొన్నటి వరకూ ఫడ్నవీస్ డిప్యూటీ, ఇప్పుడు ఫడ్నవీస్ కు షిండే డిప్యూటీ! ఇక అజిత్ పవార్ తనకు అచ్చొచ్చిన డిప్యూటీ సీఎం హోదాను పొందడమూ లాంఛనమే. గతంలో ఫడ్నవీస్ కు కొన్ని గంటల పాటు అజిత్ డిప్యూటీగా వ్యవహరించారు. ఆ తర్వాత షిండే సీఎం అయ్యాకా మళ్లీ డిప్యూటీ సీఎం హోదాను పొందారు. ఇప్పుడు ఫడ్నవీస్ కు ఉండబోయే ఇద్దరు డిప్యూటీ సీఎంలలో అజిత్ పవర్ కూడా ఉండటం లాంఛనప్రాయమే!
ఇక డిప్యూటీ సీఎంలు ఇద్దరు డమ్మిలు అవుతారు గట్టిగా మాట్లాడితే వారి పార్టీలు చీలతాయి..
మోడీ అమిత్ షా లను తక్కువ అంచనా వేయద్దు..
Call boy jobs available 7997531004
Dy. CM ane post very popular now..