27 కోట్ల‌లో పంత్ కు ద‌క్కేదెంతంటే!

ఐపీఎల్ వేలంలో ఆట‌గాళ్ల‌లో ఒక కేట‌గిరి వారంతా 30 శాతం ట్యాక్స్ స్లాబ్ లోకి వెళ్లిపోతార‌ని నిపుణులు చెబుతున్నారు.

ఐపీఎల్ ఆట‌గాళ్ల వేలంలో 27 కోట్ల రూపాయ‌ల ధ‌ర ప‌లికి స‌రికొత్త రికార్డును సృష్టించిన రిష‌బ్ పంత్ కు అందులో ఎంత మొత్తం ద‌క్కుతుంద‌నేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశ‌మే. వేలంలో ఎంత ధ‌ర ప‌లికిన ఆట‌గాడికి అయినా ఆ మొత్త‌మంతా ద‌క్క‌ద‌నేది అంద‌రికీ క్లారిటీ ఉండిన అంశ‌మే కావొచ్చు. ప‌ది కోట్లు, ఇర‌వై కోట్లు, ఇలా ఇర‌వై ఏడు కోట్లు .. ఐపీఎల్ లో భారీ నంబ‌ర్లు చాలా రొటీన్ అయ్యాయి. పంత్ వేలాన్నే గ‌మ‌నిస్తే.. 23 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ రెండు ప్రాంచైజ్ ల వాళ్లు గ‌ట్టిగా పోటీ ప‌డ్డారు!

కేవ‌లం రెండు కోట్ల రూపాయ‌ల ద‌గ్గ‌ర నుంచి పంత్ వేలం మొద‌లైంది. పాతిక ల‌క్ష‌ల రూపాయ‌ల చొప్పున పెరుగుతూ, పెరుగుతూ వెళ్లింది. ప‌ది కోట్ల వ‌ర‌కూ మూడు నాలుగు ప్రాంచైజ్ లు పోటీకి వ‌చ్చాయి. అయితే ఇర‌వై కోట్ల ధ‌ర‌ను రెండు ప్రాంచైజ్ లు దాటించాయి. 23 కోట్ల స్థాయిలో పంత్ వేలం సాగుతూ ఉండ‌గా.. అలాగే పోటీ కొన‌సాగుతూ ఉండ‌గా, యాక్ష‌నీర్.. వేలాన్ని ఆపి పంత్ కు గ‌రిష్టంగా ఎంత చెల్లించ‌గ‌ల‌రో కోట్ చేయాల‌ని ఇరు ప్రాంచైజ్ ల‌ను కోరారు. ఆ స‌మ‌యంలో ల‌క్నో జ‌ట్టు యాజ‌మాన్యం పంత్ కు 27 కోట్ల రూపాయ‌ల నంబ‌ర్ ను ప్ర‌క‌టించింది. అప్ప‌టి వ‌ర‌కూ పంత్ విష‌యంలో 23 కోట్ల వ‌ర‌కూ పోటాపోటీ పాట సాగ‌గా, ఒక్క‌సారిగా నాలుగు కోట్ల రూపాయ‌ల మొత్తాన్ని పెరిగింది.

అయితే ఆ త‌ర్వాత మ‌రే ప్రాంచైజ్ పోటీకి రాలేదు. ల‌క్నో యాజ‌మాన్యం 27 కోట్ల రూపాయ‌ల వేలాన్ని పాడ‌గా.. ఆ పై మ‌రో నంబ‌ర్ వినిపించ‌క‌పోవ‌డంతో అది రికార్డు ధ‌ర కూడా అయ్యింది. అయితే ఈ మొత్త‌మంతా పంత్ కు ద‌క్క‌దు. ఇందులో చెప్పుకోద‌గిన వాటా భార‌త ప్ర‌భుత్వానికి ప‌న్నుల రూపంలో వెళ్లిపోతుంది!

ఐపీఎల్ వేలంలో ఆట‌గాళ్ల‌లో ఒక కేట‌గిరి వారంతా 30 శాతం ట్యాక్స్ స్లాబ్ లోకి వెళ్లిపోతార‌ని నిపుణులు చెబుతున్నారు. 27 కోట్ల రూపాయ‌ల ధ‌ర ప‌లికిన పంత్ అందులో భారీ మొత్తాన్నే ప‌న్నుగా చెల్లించుకోవాల్సి ఉంటుంద‌ట‌! క‌నీసం ఎనిమిది కోట్ల రూపాయ‌ల నుంచి గ‌రిష్టంగా తొమ్మిది కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ పంత్ ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంద‌ట‌. అంటే దాదాదాపు ముప్పై శాతం మొత్తం ప‌న్ను రూపంలో పంత్ చెల్లించుకోవాల్సి ఉంటుంది.

ఇక ప్రాంచైజ్ లు కూడా ఆట‌గాళ్ల ధ‌ర‌ను అందుబాటులో ఉన్న మ్యాచ్ ల వారీగా చెల్లిస్తాయి. భార‌త ఆట‌గాళ్ల‌కు ఈ విషయంలో పెద్ద ఇబ్బంది లేదు. అదే విదేశీ ఆట‌గాళ్ల‌కు మాత్రం వారి అంత‌ర్జాతీయ మ్యాచ్ లు, బోర్డుల అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్ల ఎన్ని మ్యాచ్ ల‌కు అందుబాటులో లేక‌పోతే అన్ని మ్యాచ్ ల‌కు వారి మ్యాచ్ ఫీజును ప్రాంచైజ్ లు చెల్లించ‌వు. అందుబాటులో ఉన్న మ్యాచ్ ల‌కు మాత్ర‌మే చెల్లింపులు చేస్తాయి.

భార‌త ఆట‌గాళ్ల‌కు మాత్రం ఐపీఎల్ వేళ అంత‌ర్జాతీయ క్రికెట్ కు పూర్తిగా ఆట‌విడుపు. గాయాలు వంటి వ‌ల్ల మ్యాచ్ ల‌కు దూర‌మైనా ఇన్సూరెన్స్ క‌లిసి వ‌స్తుంది. గాయం కార‌ణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌క‌పోయినా ఇన్సూరెన్స్ రూపంలో మొత్తం ఫీజు ఆట‌గాళ్ల‌కు అందే ఏర్పాట్లు ఉంటాయి ఐపీఎల్ లో.

3 Replies to “27 కోట్ల‌లో పంత్ కు ద‌క్కేదెంతంటే!”

  1. "యాక్ష‌నీర్.. వేలాన్ని ఆపి పంత్ కు గ‌రిష్టంగా ఎంత చెల్లించ‌గ‌ల‌రో కోట్ చేయాల‌ని ఇరు ప్రాంచైజ్ ల‌ను కోరారు. 
    ఆ స‌మ‌యంలో ల‌క్నో జ‌ట్టు యాజ‌మాన్యం పంత్ కు 27 కోట్ల రూపాయ‌ల నంబ‌ర్ ను ప్ర‌క‌టించింది.
    అప్ప‌టి వ‌ర‌కూ పంత్ విష‌యంలో 23 కోట్ల వ‌ర‌కూ పోటాపోటీ పాట సాగ‌గా, ఒక్క‌సారిగా నాలుగు కోట్ల రూపాయ‌ల
    మొత్తాన్ని పెరిగింది. అయితే ఆ త‌ర్వాత మ‌రే ప్రాంచైజ్ పోటీకి రాలేదు."

    Vishayam theliyanappudu muskoni kurchovali... RTM ante yento thelusa niku...?

Comments are closed.