రాజకీయ నాయకులకు ఏ రోటికాడ ఆ పాట పాడడం చాలా మామూలు సంగతి. ఏ కార్యక్రమానికి వెళితే అక్కడకు హాజరయ్యే స్థాయిని బట్టి.. ఆ నాయకులు స్పందించాలి. అక్కడకు వచ్చే ప్రజలకు నచ్చే విధంగా మాట్లాడాలి. అందుకే ఏ కార్యక్రమానికి వెళ్లినా.. ఆ రంగానికి అనుకూలంగా, వారి ముఖప్రీతికోసం అన్నట్టుగా నాయకులు మాట్లాడుతుంటారు. సీనియర్ నాయకుడు కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ ధోరణి కూడా ఇందుకు భిన్నం కాదా? అని నాయకులకు ఆశ్చర్యం కలుగుతోంది.
జాతీయ ప్రతిగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ మాట్లాడారు. ఆయన తన మాటల్లో పత్రికారంగానికి నష్టం జరుగుతోందని, ఆ రంగాన్ని కాపాడడానికి మరిన్ని నూతన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన అంటున్నారు. డిజిటల్ వేదికల నుంచి సంప్రదాయ మీడియాకు తీవ్రమైన పోటీ ఎదురవుతున్నదట. ఈ భారాన్ని తట్టుకోవడానికి ఆయన కొన్ని సలహాలు కూడా చెప్పారు.
పత్రికల్లో వచ్చే సమాచారాన్ని వాడుకుంటున్న ఇతర వేదికల వారు.. ఆయా పత్రికలకు కొంత సొమ్ము ముట్టజెప్పేలా కొత్తవిధానం తీసుకురావాలని అశ్వనీ వైష్ణవ్ అంటున్నారు. ఇది అసలు సాధ్యమేనా అనే చర్చ ప్రజల్లో జరుగుతోంది.
పత్రికలు సమాచారాన్ని ప్రజలకు అందిస్తుండవచ్చు. కానీ.. ఆ సమాచారం మీద తమకు కాపీరైట్ హక్కులు ఉన్నాయన్నంతగా భీష్మించుకుంటే మొదటికే మోసం వస్తుంది. సంఘటనలు, వ్యవహారాలు, వారి సొత్తులాగా భావించడం కరెక్టు కాదు కదా అనే భావన వస్తోంది. పత్రికలు చాలా కష్టపడిపోతున్నాయని ఆయన బాధపడుతున్నారు.
అయితే ఏ వార్తల్లోని సమాచారాన్ని ఎందరు ఎలా వాడుకున్నారో గుర్తించే వ్యవస్థ అంత ఈజీగా కుదురుతుందా? వారు ఒక పత్రికనుంచే ఆ సమాచారాన్ని తీసుకున్నారనే గ్యారంటీ ఏముంది? వారు రకరకాల సోర్సెస్ నుంచి సమాచారం తీసుకున్నాం అని చెప్పవచ్చు. అలాంటప్పుడు ఎవరినుంచి ఎంత సొమ్ములు వసూలు చేస్తారు.
మంత్రిగారు పలికిన ఇలాంటి మాటలు పత్రికల వారికి చాలా తియ్యగా కనిపించవచ్చు. మంత్రిగారు కూడా.. ఏధో ఈ పూట గడిచిపోతే చాలు అన్నట్టుగా పత్రికల యాజమాన్యాలకు అనుకూలంగా నాలుగు మాటలు వదలి వెళ్లిపోతున్నారా అనిపిస్తోంది. మొత్తానికి ఇదే వేదిక మీదనుంచి ఇవాళ్టి రోజుల్లో వస్తున్న వార్తల్లో ఏది నిజమో ఏది అబద్ధమూ తెలుసుకోలేకపోతున్నామని అశ్వనీ వైష్ణవ్ తన అభిప్రాయం చెప్పడం పత్రికలకు చెంపపెట్టు.
vc available 9380537747
డిజిటల్ కంటెంట్ ను పత్రికలు వాడుకోకుండా చెయ్యడమేల…ఇది ఆలోచించాలి.
Call boy works 9989793850