నో నోః ఇప్పుడు కాదు …రేపే !

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పంచాయ‌తీ ఎన్నిక‌ల కోసం ఎస్ఈసీ కొత్త‌గా రూపొందించిన  ‘ఈ-వాచ్‌’ యాప్ రాజ‌కీయ వివాదానికి దారి తీసింది. దీనిపై రాష్ట్ర ప్ర‌భుత్వం బుధ‌వారం లంచ్ మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది.  Advertisement ఈ పిటిష‌న్‌ను…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పంచాయ‌తీ ఎన్నిక‌ల కోసం ఎస్ఈసీ కొత్త‌గా రూపొందించిన  ‘ఈ-వాచ్‌’ యాప్ రాజ‌కీయ వివాదానికి దారి తీసింది. దీనిపై రాష్ట్ర ప్ర‌భుత్వం బుధ‌వారం లంచ్ మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. 

ఈ పిటిష‌న్‌ను విచారించిన హైకోర్టు లంచ్‌మోష‌న్ విచార‌ణ‌కు నిరాక‌రించింది. గురువారం అంటే రేపు విచార‌ణ చేప‌డ‌తామ‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ నేప‌థ్యంలో స‌ర్కార్‌కు న్యాయ‌స్థానంలో మ‌రోసారి చుక్కెదురైంది.

ఒక వైపు అధికార పార్టీ నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త ఎదురైనా …‘ఈ-వాచ్‌’ యాప్‌ను విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో బుధవారం ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ మాట్లాడుతూ ఎన్నికల్లో అక్రమాలు, ప్రలోభాలపై నేరుగా ఫిర్యాదుకు ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామ‌న్నారు.   ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా గోప్యంగా ఉంచుతామ‌న్నారు. ఫిర్యాదులను పరిష్కరించినట్లు మళ్లీ తెలియజేస్తామ‌న్నారు.

రేపటి నుంచి ప్లేస్టోర్‌లో యాప్‌ అందుబాటులో ఉంటుంద‌న్నారు. పారదర్శకతతో పాటు ప్రజల్లో ఎన్నికలపై నమ్మకం కలిగించేందుకే యాప్‌ రూపొందించిన‌ట్టు నిమ్మ‌గ‌డ్డ స్ప‌ష్టం చేశారు. పండుగలకు వచ్చినట్లు సొంత గ్రామాలకు వెళ్లి ఓట్లు వేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. 

చంద్ర‌బాబు త‌న స్థాయి మ‌రిచి రాజ‌కీయాలు చేస్తున్నారు

అప్పుడు జేడీ లక్ష్మీనారాయణ, ఇప్పుడు నిమ్మగడ్డ..