సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ కొత్త అవతారం ఎత్తారు. ఆయన ప్రాధమికంగా రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి. ఆ హోదాలో ఉన్న వ్యక్తి అన్ని మతాలనూ సమానంగా చూస్తున్నట్టు కనపడాలి. తను ఏ మతానికి చెందినా, ఏ మతంపై ప్రత్యేక అభిమానం ఉన్నా దానిని బాహాటంగా తెలియజేసి, ఉద్యమం రీతిలో దూకకూడదు. అది రాజ్యంగపరంగా సెక్యులర్ స్ఫూర్తికి విరుద్ధం. ఇక్కడ “సెక్యులర్” అన్న పదం కొందరికి నచ్చకపోవచ్చు. నచ్చినా, నచ్చకపోయినా అది ఇంకా మన ప్రియాంబుల్ లో ఉంది కనుక గౌరవించక తప్పదు.
అదలా ఉంచి, తిరుమల లడ్డూ విషయంలో అందరిలాగానే పవన్ కూడా మనస్తాపం చెందారనుకుందాం. ఆ బాధతోనే ఆయన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి బెజవాడ కనకదుర్గమ్మ మెట్లు కడిగారు అనుకుందాం.
ఈ అచారవ్యవహారాలకి సంబంధించిన దీక్షలు, సోపాన శుద్ధితో పాటూ గతంలో దుర్గమ్మ దేవాలయంలో క్షుద్రపూజలు జరిగాయన్న వివాదంపై కూడా విచారించవలసిందిగా డిమాండ్ చేయవచ్చుకదా. గత పదేళ్లుగా అటు తెదేపా ప్రభుత్వంలోనూ, ఆ తర్వాత వైకాపా ప్రభుత్వంలోనూ అమ్మవారి గుడిలో ఎన్నేసి అవినీతులు, అక్రమాలు జరిగాయో విచారణ జరిపించవచ్చు కదా.
ఇంతకీ తిరుమల విషయంలో నిజంగా నెయ్యిలో అపచారం అయ్యేంత కల్తీ జరిగిందా?
లేక చంద్రబాబుగారి ద్వారా వివాదం చేయబడిందా?
కల్తీ నిజంగా జరిగిపోయిందని, గత ఐదేళ్ల లడ్డూ ప్రసాదంలో తినకూడని పదార్ధాన్ని తినేసామని నమ్మేస్తున్నవాళ్లకి ఒక్కమాట.
ఎ.ఆర్ డైరీ సప్లై చేసిన నెయ్యిలో కల్తీ ఉందని చెప్పారు. ఆ నెయ్యి మొట్టమొదటిసారిగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తిరుమలకి సప్లై కాబడింది. పోనీ ఆ నెయ్యిని వాడారా అంటే..లేదు వెనక్కి పంపేసాం అన్నారు. అలాంటప్పుడు లడ్డూలో కల్తీ జరగనట్టే కదా! గత ఐదేళ్లుగా జరిగిందని చంద్రబాబు వాకృచ్చారు. పరీక్ష చేయడానికి అప్పటి నెయ్యి, అప్పటి లడ్డు ఇప్పుడెక్కడ? ఆ నిందని నిజం చెయ్యాలన్నా ఎలా సాధ్యమవుతుంది?
అంతే కాదు, టిటిడిలో నెయ్యి యొక్క క్వాలిటీ చెక్ చేసే పెద్ద ల్యాబే ఉందని కూడా చెప్పారు. ఏ ప్రభుత్వం ఎన్ని ట్యాంకర్లని క్వాలిటీ స్టాండర్డ్స్ పాటించలేదని వెనక్కి పంపిందో కూడా లెక్కలు చెప్పారు. ఇక్కడ ప్రభుత్వాల ప్రమేయం లేదు. అంతా టిటిడి సిబ్బంది వారి పని వారు చేసుకుపోతుంటారు. అయినా భగవంతుడికి నివేదించే నేతి విషయంలో క్వాలిటీ స్టాండర్డ్స్ తగ్గితేనే వెనక్కి పంపే సిబ్బంది, జంతు కొవ్వు కలిసిన నెయ్యి వస్తే సహిస్తారా? అదే జరిగుంటే ఎప్పుడో జాతీయవార్త అయ్యుండేది. సదరు డైరీపై కేసులు పెట్టి బ్యాన్ చేయడం కూడా జరిగేది.
టిటిడిలో పెద్ద వ్యవస్థే ఉంటుంది. వారిలో నిజమైన భక్తులు అనేకమంది ఉంటారు. పొరపాటునో, గ్రహపాటునో అన్నీ దాటుకుని మాంసపుకల్తీతో నెయ్యి లోపలికి వచ్చినా పోటులో దశాబ్దాలుగా పనిచేస్తున్న బ్రాహ్మణులు వాసనలో తేడా పసిగట్టరా? అసలు వారిదాకా అలాంటి నెతిని పంపగలిగే సాహసం ఎవరైనా చేయగలరా?
ఇన్ని ప్రశ్నలెందుకు? అసలు ల్యాబ్ రిపోర్ట్ లో ఉన్నదేంటి? ఎవరన్నా చదివారా లేక బాబుగారు చెప్పింది ధర్మరాజు వాక్కు అనుకుని నమ్మేస్తున్నారా? రిపోర్ట్ లో ఉన్నది “సస్పెక్టెడ్ అడల్టరేషన్” అని. అంటే అనుమానాస్పద కల్తీ అని మాత్రమే. ఆ లిస్టులో కాటన్ సీడ్, సోయా బీన్, డాల్డా నుంచి ఈ జంతు కొవ్వుల దాకా పెద్ద లిస్టుంది. అంటే అవన్నీ ఉన్నాయని కాదు. అందులో ఏదో ఒకటి ఉండే అవకాశముందని. ఏవీ లేకపోయినా “ఫాల్స్ పాజిటివ్” వచ్చే అవకాశం ఉందని కూడా ఆ రిపోర్టే చెబుతోంది.
ఇంత వివరంగా రిపోర్ట్ ఉంటే ఎంత రాద్ధాంతం చేస్తున్నారు ఉపముఖ్యమంత్రివర్యులు. వారు చదవలేదా రిపోర్ట్? లేక చదివినా బాబుగారు చెప్పిన పనిలో భాగంగా లడ్డూని అడ్డంపెట్టుకుని తమ పాలనలో లోపాలను దాచుకోవాలనుకుంటున్నారా?
పాలనాలో లోపమంటే గుర్తుకొస్తోంది. పవన్ కళ్యాణ్ దుర్గగుడి మెట్లు కడిగే సమయంలో అక్కడికి కూతవేటు దూరంలో వరదబాధిత ప్రజలు తమకు ఫ్లడ్ రిలీఫ్ అందలేదని రోడ్లపైకి వచ్చి గొడవచేసారు. పోలీసులు వారిని లాఠీ చార్జ్ చేసారు. పవన్ కళ్యాణ్ మెట్లు కడగడం అనే వార్త వల్ల ఆ వార్త సైడైపోయింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి ఎన్నైనా ఉండొచ్చు.
సంక్షేమ పథకాలు లేవు. ఇంట్లో ప్రతి సంతానానికి 15000 ఇస్తానన్న వాగ్దానం నెరవేరడంలేదు. ప్రజలు గొంతెత్తి అడిగినా ఆ గొంతు వినపడకుండా మీడియా మొత్తం లడ్డూ ప్రసాదం వివాదం మోగుతుండాలి. అదే పన్నాగమా? ముఖ్యమంత్రి అంతరంగం అదేనా? ఉపముఖ్యమంత్రి వీరంగం దానికేనా? ఏమో!
అదలా ఉంచితే..
– “సనాతన ధర్మ పరిరక్షణ” పేరుతో ఒక బోర్డుని ఏర్పరచమని పవన్ కళ్యాణ్ తనకి అందుబాటులో ఉన్న చంద్రబాబుని అడగగలరా?
– రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను ఆ బోర్డుకి అప్పజెప్పమని ప్రెజర్ చేయగలరా? అది వర్కౌట్ అయితే దేశవ్యాప్తంగా ఆ మోడల్ ని విస్తరింపజేసేందుకు ప్రధాని కూడా ఆప్తుడే కదా!
– పోనీ సద్గురు జగ్గీ వాసుదేవ్ చెప్పినట్టు ప్రభుత్వాలు కాకుండా గుడులను భక్తులు నడిపే విధంగా మార్పులు తీసుకురాగలా?
– రేపు టిటిడిలో మెంబర్షిప్పులు ఇచ్చే చోట ఏ రాజకీయ ఒత్తిడికి లొంగకుండా స్థానాలన్నీ భక్తులతోనే భర్తీ చేయించగలరా?
– కనీసం జనసేనకి కేటాయించే మెంబర్షిప్ సీట్లను ఏ సినిమావాళ్లకో, మొహమాటాలకో కాకుండా శుద్ధమైన నిఖార్సైన రాధామనోహర్ దాస్ లాంటి భక్తులకి ఇచ్చే అవకాశముందా?
ఉపముఖ్యమంత్రిగా, ప్రధానికి ఆప్తుడిగా, ముఖ్యమంత్రికి సహచరుడిగా పవన్ కళ్యాణ్ ఈ ఒక్క పని చేయగలిగితే ఆయన దీక్షకి ఒక అర్థం పరమార్ధం. లేకపోతే 11 రోజులు ఒక గెటప్పు వేసి తీసేసినట్టే. ఆయన వేసిన సవాలక్షా సినిమా గెటప్పులాంటిదే ఇదీ అనుకోవాలి. ఇది కోపంతో అంటున్నది కాదు. ఏ పని చేసినా ఒక మార్పుకు, మలుపుకి దారి తీయాలి. అదే ఇక్కడ కోరుకునేది.
టిటిడిలో రాజకీయనాయకుల హడావిడి అంతా ఇంతా కాదు. ఇది పార్టీలకి అతీతంగా ఎప్పుడూ జరిగేదే. దానికి కారణం వాళ్లపై ఉండే ఒత్తిడి. మంచి దర్శనం కూడా ఇప్పించలేవా అని నిలదీస్తారు ప్రజలు. ప్రభుత్వాధీనంలో ఉన్నప్పుడు ఈ ఒత్తిడి అంతా ఇంతా ఉండదు. పవన్ కళ్యాణ్ నిజంగా శక్తిమంతుడైతే ఈ పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టి “సనాతన ధర్మం” బోర్డుకి టిటిడిని అనుసంధానం చేయమని చెప్పగలగాలి.
అంతే కానీ కాషాయం వేసుకుని “అయితే సమర్ధించండి లేదా సైలంటుగా ఉండండి” అని ప్రకాష్ రాజ్ ని, కార్తిని బెదిరించడం దేనికి? కార్తి చేత సారీ చెప్పుంచుకోవడమేంటి? అసలు అతను అన్నది ఏంటి? లడ్డు గురించి మాట్లాడను అన్నాడు. అది కూడా బాధేనా?
పవన్ ఏదైనా ఎత్తుకుంటే దానిని సినీరంగం మొత్తం సపోర్ట్ చెయ్యాలంటే ఎలా? ఆ డిమాండ్ ఏంటి? ప్రజాస్వామ్యంలోనే ఉన్నారా ఉపముఖ్యమంత్రిగారూ! మీకు లడ్డు విషయంలో గుడ్డిగా సపోర్ట్ చేయకుండా ఏ పాయింట్ లాగినా వారు హిందూ వ్యతిరేకులా?
ఇన్ని చెప్పే ఉపముఖ్యమంత్రిగారు దేవాదాయశాఖను ఎందుకు తీసుకోలేదో!
దానిని వదిలేసి పంచాయతిరాజ్, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి శాఖలను తీసుకున్నారు. బహుశా ఆ శాఖల్లో డబ్బు ఎక్కువ కనుక దానిని పరిరక్షించే బాధ్యత తీసుకుంటున్నారు కాబోలు.
వారి ఆసక్తికి, సనాతన ధర్మ ఉద్యమస్ఫూర్తికి తగిన శాఖ తీసుకుంటే ఔచిత్యంగా ఉంటుంది. అడగాలే కానీ ఉన్న దేవాదాయశాఖ మంత్రిని తప్పించి ఉపముఖ్యమంత్రిగారికి ఇవ్వడం ముఖ్యమంత్రిగారికి ఎంతసేపు!
హరగోపాల్ సూరపనేని
అ సైకొ గాడె చూస్తె పరదాల చాటున తిరుగుతూ కొంపలొనె వుంటాడు
నువ్వెమొ చర్యలు తిసుకొకుండా …అదికారం లొ వుండి దీక్షలంటూ డ్రామెలంట్రా..బెవ్ కూఫ్
పవన్ డీసీఎం అయ్యాక చాల సౌమ్యంగా, పద్దతిగా మాట్లాడుతూన్నాడు. తన మనన ఎదో తాను దీక్ష చేసుకుంటే మీరు ఏవో కారుకూతలు కూస్తే, ఈ రోజు మీకు పెట్టిన గ/ డ్డి మాములుగా లేదు కదా? ఆ స్పీచ్ విన్నాక కూడా మీరు ఇంకా బురద చల్లుతున్నారంటే మీ చర్మం మొసలి చర్మం కన్నా మందం అనుకోవాలి.
పవన్ ని విమర్శించి విమర్శించి డిప్యూటీ చేశావు. ఇంకా ఆగడం లేదు నువ్వు . సిఎం అయ్యేదాకా ఆగవా? నిజం చెప్పు నువ్వు రెడ్డి ముసుగు లో ఉన్న పవన్ fan కదా? Jai GA, jai Pavan
CM avvdaniki Babu oppukodu le. Johny master mata varasaki edho 2029 lo CM annandhuke lopala nettaru.
పవన్ కి టిడిపి తో కలిస్తే value ఏమీ ఉండదు అని అన్నారు. Pavan value and capabilities telisai last elections lo. Inka అనుమానాలు unte….inklka term wait cheyyandi.
ee saari gundu sunnane mee jalagaku
ఇన్నాళ్లకు సరైనోడికి అధికారం దక్కింది.పవన్ కి సమాజం పట్ల గౌరవం ,బాధ్యత వుంది. పరిణితి చెందిన వ్యక్తి లా మాట్లాడుతూ వున్నాడు. We Appreciate👍
వెల కొట్లకి పడగెత్తి, జిందాల్ లాంటి పెత్తందార్ల కొసం అరాచకం చెసిన జగన్ మాత్రం….. పెదలకి పెత్తందార్ల మద్య యుద్దం అంటూ ఎకంగా రాబిన్ హుడ్ అవతారం ఎత్తి నప్పుడు…… సంకలు గుద్దుకున్నావె కాని ఇదెమి వింత అయ్యా…… అని ఒక ఆర్టికల్ రాశావా గురువిందా?
Veedi 3 pellam pillaku ippatiki Christians… Mundu vallani Hinduvula ga marchamanu… Eee package kukka anthe boss ki problem vaste ventane vadtadu…. Paleru banisa gadu
పిచ్చి GA….PAWAN ఎప్పుడు ధర్మం వైపు వుంటాడు…మతం వైపు కాదు….అప్పట్లో కులాలను కలిపే ఆలోచన గురించి చెప్తే , ఇంతకన్నా ఎక్కువ విషం కాక్కావ్….చివరకు ఏమైందో చూసావు గా…జనానికి అన్ని అర్థం అవుతాయి GA …కేవలం హిందూ ధర్మం యే కాదు GA….ఎవరికి ఇబ్బంది వచ్చినా PAWAN నిలబడతాడు….SM లో మీ వెకిలి వేషాల వల్ల pawan కు లాభమే కానీ నష్టం వుండదు GA….😂😂….DOUBT వుంటే మన అన్నయ్యను అడుగు…చెప్తాడు…
చేగువేరా లాఫింగ్ ఫ్రమ్ కార్నర్ 🤣🤣🤣
పంచాయితీ రాజ్ శాఖలో కేవలం డబ్బును చూసావు కాబట్టే పాతాళానికి పోయావ్….పేదవాడి ఉపాధి అవకాశాలు, తాగునీరు చూసాడు కాబట్టే PAWAN ఇప్పుడు అందరి మన్నలను పొందుతున్నాడు….
అబ్బో చా,😅😅😅😅😅ఆ పీక.. లేని …..పావులా గాడి……గురించి తర్వాత…..కాని….ముందు…..నీ పేరుతో ట్వీట్ చెయ్యడం ……. నేర్చుకోరా….. కొజ్జ……ఎల్……. కో…….క
Call boy jobs available 9989793850
we call it Guts GA .. Guts..
Puli puli ani cheppukoni tiragadam kaadu.. Gu**la dammu undali
inka batiki em chestav haragopal
వాడేదో నెక్ట్ టర్మ్ సిఎం అవ్వాలని అన్నీయను ఫాలో అయి యాక్టింగ్ మొదలెట్టేసాడు. అయిపోతాడు, AP అంటేనే అమాయక ప్రజలు. నమ్మెస్తారు
పంచాయితీ రాజ్ శాఖలో కేవలం డబ్బును చూసావు కాబట్టే పాతాళానికి పోయావ్….పేదవాడి ఉపాధి అవకాశాలు, తాగునీరు చూసాడు కాబట్టే PAWAN ఇప్పుడు అందరి మన్నలను పొందుతున్నాడు….
pora bevakuf a1
As EX TTD chairman Karunakar Reddy has taken oath at lord Venkateshwara temple Tirumala stating false and baseless allegations surrounding Tirupathi laddu…. why can’t CBN and Pavan Kalyan do the same if they are honest in proving it
Request to endorse the case to CBI enquiry?
My opinion, case to be endorsed CBI……
బప్తీసం తీసుకున్న వీడు హిందువు ఎలా అయ్యాడు?