హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఫస్ట్ రౌండ్‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు బీజేపీ షాక్ ఇచ్చింది.
పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్‌కు ఆధిక్యత లభించిన సంగతి తెలిసిందే. దీంతో ఇదే ఒరవడి ఈవీఎంల కౌంటింగ్‌లోనూ కొనసాగుతుందని టీఆర్ఎస్ ఆశించింది. కానీ మొదటి రౌండ్ ఫలితం మాత్రం టీఆర్ఎస్‌కు చేదు మిగిల్చింది.
హుజూరాబాద్ మొదటి రౌండ్‌లో మొత్తం 9173 ఓట్లున్నాయి. హుజూరాబాద్ మండలంలోని ఓట్లను మొదటి రౌండ్ కింద లెక్కిం చారు. ఇందులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 4610 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు 4444 ఓట్లు , కాంగ్రెస్ భ్యర్థి బి.వెంకట్‌కు 119 ఓట్లు లభించాయి. దీంతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 166 ఓట్ల ముందంజలో ఉన్నారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఓట్ల లెక్కింపులో బీజేపీ ఆధిక్యత లభించడంతో ఆ పార్టీ ఉత్సాహంగా ఉంది. అయితే 20కి పైగా రౌండ్లు ఉన్నాయని, తప్పక గెలుస్తామని టీఆర్ఎస్ నేతలు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నిక వచ్చిన సంగతి తెలిసిందే.