బడ్జెట్ లో అన్యాయం కంటే పార్టీ అధికారంలో లేదనే బాధే ఎక్కువ

కేంద్ర బడ్జెట్​లో తెలంగాణకు అన్యాయం జరిగింది. ఇది వాస్తవం. దీనిపై సీఎం రేవంత్​ రెడ్డి బాధ పడటమే కాకుండా తీవ్రంగా ఆగ్రహించాడు. మిగతా కాంగ్రెసు నాయకులు కూడా ఇలాగే రియాక్ట్​ అయ్యారు. ప్రధాని మోదీని…

కేంద్ర బడ్జెట్​లో తెలంగాణకు అన్యాయం జరిగింది. ఇది వాస్తవం. దీనిపై సీఎం రేవంత్​ రెడ్డి బాధ పడటమే కాకుండా తీవ్రంగా ఆగ్రహించాడు. మిగతా కాంగ్రెసు నాయకులు కూడా ఇలాగే రియాక్ట్​ అయ్యారు. ప్రధాని మోదీని ‘పెద్దన్న’ అని గౌరవించినా ఆయన కనికరించలేదని రేవంత్​రెడ్డి ఆవేదన సారాంశం. రాష్ట్రానికి సాయం చేయాలని తాను మూడుసార్లు అడిగానని, మంత్రులు మోదీని 18 సార్లు కలుసుకున్నారని, అయినా దయ తలచలేదని అన్నాడు.

గులాబీ పార్టీకి అల్రెడీ మోడీతో ఎప్పటి నుంచో వైరం ఉందన్న సంగతి తెలిసిందే కదా. ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ఆగ్రహించడంలో ఆశ్చర్యం లేదు. బీఆర్​ఎస్​ అధికారంలో ఉన్న పదేళ్లు మోడీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని హైపీచ్​లో పాడుతూనే ఉన్నారు. దానికి తగ్గట్టుగానే అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్​ ప్రవర్తన, ధోరణి కూడా అదే విధంగా ఉన్నాయి. ప్రధాని స్థానంలో ఉన్న మోదీని ఏనాడూ లెక్క చేయలేదు. ఆయన అధికారిక కార్యక్రమాలకు రాష్ట్రానికి వచ్చినా ప్రోటోకాల్​ పాటించలేదు. అంటే మర్యాదగా ఎయిర్​పోర్టుకు వెళ్లి రిసీవ్​ చేసుకోలేదు.

మోదీ వచ్చినప్పుడల్లా మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ను పంపించేవాడు. అంటే నామమాత్రంగా స్వాగతం పలకడమన్నమాట. మోదీపై పరుషంగా కూడా మాట్లాడేవాడు. కేసీఆర్​ ధోరణికి తగ్గట్లుగానే మోదీ కూడా రాష్ట్ర డిమాండ్లను పట్టించుకోలేదు. కేసీఆర్​ బాటలోనే ఆయన కుమారుడు కేటీఆర్​, మేనల్లుడు హరీష్​రావు, ఇతర మంత్రులు నడిచారు. కేసీఆర్​శకం ముగిశాక సీఎం కుర్చీ ఎక్కిన రేవంత్​ రెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరించాడు. తాము కేంద్రంతో ఘర్షణ పడబోమన్నాడు. మోదీ వచ్చినప్పుడల్లా స్వాగతం పలికాడు.

‘పెద్దన్న’ మాదిరిగా రాష్ట్రాన్ని ఆదుకోవాలన్నాడు. రేవంత్​ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇదే మొదటి కేంద్ర బడ్జెట్​. రాష్ట్రాలు సహజంగానే కేంద్ర బడ్జెట్​పై ఎన్నో ఆశలు పెట్టుకుంటాయి. రేవంత్​ రెడ్డి కూడా అలాగే పెట్టుకున్నాడు. కాని రాష్ట్రం కోరినవి బడ్జెట్​లో నెరవేర్చలేదు. కేంద్రంలో మంత్రులుగా ఉన్న ఇద్దరు తెలంగాణ బీజేపీ ఎంపీలు కిషన్​రెడ్డి, బండి సంజయ్​కుమార్​సహజంగానే రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేయలేదన్నారు. వాళ్లు బీజేపీ మంత్రులు కాబట్టి మనసులో ఏమున్నా బయటకు చెప్పలేరు కదా.

ఇక కేటీఆర్ ​బడ్జెట్​పై తీవ్రంగానే రియాక్ట్​అయ్యాడు. ‘ఏపీకి ఇచ్చినదానిపై మాకు బాధ లేదు, అసూయ లేదు’ అన్నాడు. తన సహజ ధోరణిలో కేంద్రంపై, బీజేపీపై ఘాటు విమర్శలు చేశాడు. రాష్ట్రంలో బీఆర్​ఎస్​అధికారంలో ఉంటే ఇలా అన్యాయం జరగకపోయేదన్న ధోరణిలో మాట్లాడాడు. ఆంధ్ర, బిహార్​కు ఇచ్చిన నిధులను చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచించాలని అన్నాడు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెసును, బీజేపీని చెరో ఎనిమిది స్థానాల్లో గెలిపిస్తే రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదన్నాడు. స్వీయ రాజకీయ అస్తిత్వమే (అంటే బీఆర్​ఎస్​పార్టీ) తెలంగాణకు రక్ష అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నాడు.

ప్రాంతీయ శక్తులను ఎందుకు బలోపేతం చేయాలో కేంద్ర బడ్జెట్​ నిరూపించిందని అన్నాడు. మోడీకి మద్దతుగా ఉన్న టీడీపీ, జేడీయూ ప్రాంతీయ పార్టీలేనని అన్నాడు. పార్లమెంటులో ఉన్న కాంగ్రెసు, బీజేపీ ఎంపీలు అన్యాయం జరుగుతున్నా ఏమీ మాట్లడలేదని, అదే గులాబీ పార్టీ ఎంపీలు ఉన్నట్లయితే కేంద్రం వైఖరిని గట్టిగా వ్యతిరేకించేవారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పోరాడే సత్తా గులాబీ పార్టీకే ఉందనే భావన కేటీఆర్​ వ్యక్తం చేశాడు.

కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి అన్యాయం జరిగినా కాంగ్రెస్​, బీజేపీ ఏమీ చేయలేకపోయాయని ప్రచారం చేయడానికి బీఆర్​ఎస్​కు అవకాశం దొరికింది. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించకుండా, పార్లమెంటు ఎన్నికల్లో శూన్యం చేసినందుకు తగిన శిక్ష పడిందని ప్రజల మైండ్​లోకి ఇంజెక్ట్​ చేస్తారు.

7 Replies to “బడ్జెట్ లో అన్యాయం కంటే పార్టీ అధికారంలో లేదనే బాధే ఎక్కువ”

  1. వీడి బాధ కొత్తగా వస్తున్నా హీరోయిన్స్ ని ఫోన్ టాప్ చేసి వలలో వేసి ఫార్మ్ హౌస్ కి ఎత్తుకెళ్లలేకపోతున్నామే అని , చెల్లి తీహార్ , ముక్కోడు రేపో , ఎల్లుండో చర్లపల్లి , వీడు చంచల్ గూడ

  2. అయినా మీ దొర మీ రాష్ట్రాన్ని ఆంధ్ర తో పోల్చుకోవడం పెద్దగా ఇష్ట పడడు, ఛీ మన ధనిక రాష్ట్రం తో పక్క రాష్ట్రం పోలికా అని అన్నాడు, కొంచెం గతం గుర్తుపెట్టు కోవాలే కదా చిన్న దొరా

  3. \\దానికి తగ్గట్టుగానే అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్​ ప్రవర్తన, ధోరణి కూడా అదే విధంగా ఉన్నాయి. ప్రధాని స్థానంలో ఉన్న మోదీని ఏనాడూ లెక్క చేయలేదు. \\

    పార్లమెంట్ లో ఏ బిల్లునైనా వ్యతిరేకించాడా? అది అంతా కెసిఆర్ డ్రామా.

  4. ధనిక రాష్ట్రం ayina మీరు అడుక్కోవటం ఏంది చిన్న దొర… అపర భగీరథుడు, ప్రపంచ kuberulanu రాష్ట్రం దారి పట్టించే మీరు వుండగా.. అయిన పెద్ద దొర తెలంగాణ మొత్తం డెవలప్ చేసుకున్నాం ఇప్పుడు దేశ చరిత్రను మారుస్తాం అంతిరి గద.. అంత హులక్కేనా?

Comments are closed.