హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం

కొన్నాళ్లుగా తగ్గిందనుకున్న డ్రగ్స్ కల్చర్ మరోసారి బయటపడింది. హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ లో ఓ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.

కొన్నాళ్లుగా తగ్గిందనుకున్న డ్రగ్స్ కల్చర్ మరోసారి బయటపడింది. హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ లో ఓ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఎప్పట్లానే ఈసారి కూడా ప్రముఖుల కొడుకులు పట్టుబడ్డారు. కానీ వివరాలు వెల్లడించకుండానే అందర్నీ రిలీజ్ చేశారు.

మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌజ్ లో రాత్రి డ్రగ్స్ పార్టీ జరిగింది. విషయం తెలుసుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫామ్ హౌజ్ పై దాడి చేశారు. మాదక ద్రవ్యాలతో పాటు, పెద్ద మొత్తంలో మద్యాన్ని సీజ్ చేశారు.

ఈ పార్టీ కోసం ముంబయి నుంచి ప్రత్యేకంగా అమ్మాయిల్ని రప్పించారు. వాళ్లతో అర్థనగ్న నృత్యాలు చేయించారు. అంతా కలిసి డ్రగ్స్ తీసుకొని పార్టీ చేసుకున్నారు.

దాడుల్లో భాగంగా ఏడుగురు యువతుల్ని, 12 మంది అబ్బాయిల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీళ్లలో కొంతమంది బడా బాబుల పిల్లలు ఉన్నారు. కొందర్ని విడిచిపెట్టినట్టు తెలుస్తోంది. ముంబయి నుంచి అమ్మాయిల్ని తీసుకొచ్చిన డీలర్ ను కూడా అరెస్ట్ చేశారు. ఎంత మొత్తంలో మాదకద్రవ్యాలు సీజ్ చేశారనే విషయంపై ఇంకా ప్రకటన రాలేదు.

2 Replies to “హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం”

Comments are closed.