మగాళ్లలా వెండితెరపై పోరాడదాం రా!

నాకిష్టం లేకపోయినా వేయించారు. అన్న కోసం అమ్మాయి గెటప్ కోసం వేశాను.

నటుడు మంచు మనోజ్ మరోసారి మీడియా ముందుకొచ్చాడు. తన ఇంటిని మంచు విష్ణు ధ్వంసం చేశాడంటూ ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మనోజ్.. ఈరోజు నేరుగా అతడిపైనే విమర్శలు చేశాడు. మగాడివైతే వెండితెరపై పోటీ పడదాం రా అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశాడు.

“కన్నప్ప మీదకు భైరవం సినిమాను వదుల్తానని భయపడ్డాడు. మగాళ్లలా వెండితెరపై పోరాడదామని నా భైరవం సినిమాను వదుల్దామనుకున్నాను. అంతే, టెన్షన్ అయిపోయాడు. కన్నప్ప పోస్ట్ పోన్ చేసుకున్నాడు. ఆ కోపాన్ని నాపై ఇలా చూపిస్తున్నాడు. నేను ఊరిలో లేనప్పుడు నా ఇంటిపై దాడి చేయడం మగతనమా?”

మోహన్ బాబు కోసం, విష్ణు కోసం తను ఎంతో చేశానని, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేశానంటూ గతంలో చెప్పుకొచ్చిన విషయాల్నే మరోసారి రిపీట్ చేశాడు మనోజ్. ఆ కృతజ్ఞత కూడా లేకుండా తన ఇంటిపై దాడి చేశారని ఆరోపించాడు. ఓవైపు వివాదం హైకోర్టులో ఉన్నప్పటికీ, మరోవైపు కింది కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకొని తనను ఇబ్బంది పెడుతున్నారని అన్నాడు.

“విష్ణు కెరీర్ కోసం నాతో ఆడ వేషం వేయించారు. నేను లేడీ గెటప్ వేయకపోతే విష్ణు కెరీర్ నిలబడదని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి, నాకిష్టం లేకపోయినా వేయించారు. అన్న కోసం అమ్మాయి గెటప్ కోసం వేశాను. గ్రాఫిక్స్, స్టంట్స్, సాంగ్స్ ఇలా ఎన్నో చేశాను. గొడ్డు చాకిరీ చేశాను. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆ కృతజ్ఞత కూడా లేదు వాళ్లకి.”

తను గ్రాఫిక్స్ నేర్చుకుంటే, మంచు విష్ణు గ్రాఫిక్ కంపెనీ పెట్టుకున్నాడని.. నాన్న మోహన్ బాబు థియేటర్ పెట్టుకుంటే ఇతడు సమోసాలు అమ్ముకున్నాడని ఎద్దేవా చేశాడు మనోజ్. దొంగ దెబ్బలు తీయడం ఆపేసి, ఇప్పటికైనా మగాడిలా ముందుకొచ్చి, పెద్ద మనుషుల సమక్షంలో తనతో చర్చలు జరపాలని డిమాండ్ చేశాడు.

7 Replies to “మగాళ్లలా వెండితెరపై పోరాడదాం రా!”

  1. మీ గొడవ సంగతి తర్వాత…ముందు భైరవం నిర్మాత ను ఒడ్డున పడేయండి…

  2. బురిడీ శిరిడీ మీ ఇంటి దైవం కదా …. ఆడిని నమ్ముకుంటే ఇదే గతి….బురిడీ భక్తులు ఆడి బొమ్మలు padeyandi

  3. ||కృతజ్ఞత లేకుండా తన ఇంటిపై దాడి చేసారని చెప్పాడు||

    వాళ్ళు తమ కృతజ్ఞత ఇలా చూపిస్తున్నారేమో, ఎవరి స్టైలు వారిది

Comments are closed.