గులాబీ దళపతికి రేవంత్ ఆఫర్!

నిత్యమూ రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని విమర్శిస్తూనే గడిపేయాల్సిన అవసరం లేదు. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కు ఒక స్ట్రెయిట్ ఆఫర్ ఇచ్చారు. రాష్ట్రం కోసం ఇప్పటికీ పోరాడడానికి, రాష్ట్రం కోసం…

నిత్యమూ రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని విమర్శిస్తూనే గడిపేయాల్సిన అవసరం లేదు. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కు ఒక స్ట్రెయిట్ ఆఫర్ ఇచ్చారు. రాష్ట్రం కోసం ఇప్పటికీ పోరాడడానికి, రాష్ట్రం కోసం ఏదైనా సాధిస్తే.. అందులో ఆయన కూడా క్రెడిట్ పంచుకోవడానికి మంచి అవకాశం ఇచ్చారు.

సాధారణంగా ఒక పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు.. రాష్ట్రాన్ని ఉద్ధరించే ప్రతి పని కూడా తమ చేతుల మీదు గానే జరగాలని కోరుకుంటుంది. కానీ.. రేవంత్ రెడ్డి.. చాలా సామరస్య ధోరణిలో కేసీఆర్ కు కూడా వాటా ఇవ్వాలనుకుంటున్నారు.

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని బిజెపి మినహా అన్ని పార్టీలు కూడా భావిస్తున్న ప్రస్తుత తరుణంలో.. ఢిల్లీలో దీక్ష చేయడానికి నేను రెడీ.. ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా వస్తే కలిసి చేద్దాం.. కలిసి కేంద్రంపై పోరాడదాం. కలిసి రాష్ట్రం కోసం సాధిద్దాం అంటూ పిలుపు ఇచ్చారు.

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ ప్రస్తావన లేదని, రాష్ట్రానికి అన్యాయం జరిగిందని రెండు రోజులుగా.. రాద్ధాంతం అవుతోంది. రాష్ట్రానికి నిధులు సాధించడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ దీక్ష చేయాలని, భారాస ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు చేసిన డిమాండుపై సీఎం రేవంత్ స్పందించారు. తాను అందుకు సిద్ధమని అంటూనే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే ప్రభుత్వాధినేతగా తాను కూడా వస్తానని రేవంత్ అన్నారు.

రాష్ట్రానికి నిధులు సాధించడానికి కేసీఆర్ ముందుకు రావాలని కోరారు. ‘చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చాం అని మేమెన్నడూ చెప్పుకోలేదు’ అంటూ వారిని ఎద్దేవా చేశారు కూడా!

నిజానికి బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే అభిప్రాయం అన్ని పార్టీల వారిలో ఉంది. అందుకోసం పోరాటం మాత్రం ఒక్క అధికార పార్టీ మాత్రమే చేయాలని ఏముంది? భాజపా నాయకులు బడ్జెట్ ను పొగడ్డం తప్ప ఏం చేయలేరనేది అర్థం చేసుకోవచ్చు. గులాబీ నాయకులు కేవలం నిందలతో సరిపెట్టకుండా.. తామే దీక్షలకు పూనుకోవచ్చు కదా.. అనేది ప్రజల సందేహం. రాష్ట్రం కోసం పోరాటం అనేది రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారు మాత్రమే చేయాలనే నిబంధన లేదు కదా అని ప్రజలు అంటున్నారు.

8 Replies to “గులాబీ దళపతికి రేవంత్ ఆఫర్!”

  1. తెలంగాణ మొత్తం డెవలప్ అయ్యింది.. దేశానికి అన్నం పెడుతున్నాం… మా రాష్ట్రం మీదనే దేశం నడుస్తుంది అని చెప్పిన దొరకు ఇప్పుడు జస్ట్ కేంద్రం నుంచి భిక్షను తీసుకువడానికి బయటకు రామెంటార? చావు నోట్లో తల పెట్ట మంటార?

  2. నిదో సోది పేపర్, వీడో సోది సిఎం…చేతకానప్పుడు, దిగిపోతే, ఆ భట్టొ, ఇట్టియో ఎక్కుతాడు, తను కూడా ఓ రెండురోజులు అనుభవిస్తాడు సిఎం పదవిని..అంతేకాని, ఈ మంగళవారం మాటలు దండగ..

  3. మొన్న ఎవడో పుక్ గాడు ఇంకేముంది వచ్చేశాడు కుంటి నాయలు అసెంబ్లీ కి అన్నాడు గా ఎక్కడ వాడు raale

Comments are closed.