వివాదాస్పద దర్శకుడు సినిమాల విషయాలే కాదు రాజకీయాలపై కూడా తనవైన అభిప్రాయాలను స్పష్టంగా చెబుతుంటారు. ఎవరి మెప్పుకోసమో, లేదంటే తిట్ల కోసమో కాకుండా తాను అనుకున్నది, నమ్మిన వాటిని సోషల్ మీడియా వేదికగా పంచు కోవడం వర్మ అలవాటు.
ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్‌రెడ్డిని నియమించడంపై ఆయన ఆసక్తికర ట్వీట్ చేశాడు. రేవంత్‌ను సింహంతో పోల్చడం గమనార్హం. కాంగ్రెస్‌పై చాలా కాలం తర్వాత ఆసక్తి కలిగిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఈ ట్వీట్ ఆకట్టుకుంటోంది.
‘సింహం లాంటి వ్యక్తి రేవంత్‌రెడ్డిని అధ్యక్షుడిగా నియమించడం ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఓ అద్భుతమైన నిర్ణయం. ఈ సింహాన్ని చూసి పులులన్నీ భయపడనున్నాయి. రేవంత్ నియామకంతో ఎన్నో సంవత్సరాల తర్వాత నాకు కాంగ్రెస్ రాజకీయాలపై ఓ ఆసక్తి ఏర్పడింది. రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు’ అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు.
రేవంత్‌రెడ్డి దూసుకుపోయే స్వభావం వర్మకు నచ్చినట్టుంది. డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్న నేతగా వర్మ గుర్తించినట్టున్నాడు. అందుకే ఆయన్ను సింహంతో పోల్చాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రత్యర్థులను కవ్వించే వర్మ తాజా పొలిటికల్ హీట్ ట్వీట్ మాత్రం వైరల్ అవుతోంది. ఇంతకూ భయపడుతున్న పులులేంటో కూడా వర్మ వివరించి ఉంటే బాగుండేదేమో!