స్టైరిన్ తరలినా….విషం ఇంకా మిగిలే ఉంది

విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో  పది రోజుల క్రితం జరిగిన  స్టైరిన్ గ్యాస్ లీకేజి దుర్ఘటన  యావత్తు లోకం చూసింది. ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్రప్రభుత్వం వేగంగా స్పందించింది, లేకపోతే మరణాలు దారుణమైన సంఖ్యలో…

విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో  పది రోజుల క్రితం జరిగిన  స్టైరిన్ గ్యాస్ లీకేజి దుర్ఘటన  యావత్తు లోకం చూసింది. ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్రప్రభుత్వం వేగంగా స్పందించింది, లేకపోతే మరణాలు దారుణమైన సంఖ్యలో ఉండేవని నిపుణులే అంటున్న మాట. సరే బాధితులకు భారీ నష్టపరిహారం కూడా సర్కార్ చెల్లించింది.

ఎల్జీ పాలిమార్స్ లో  స్టైరిన్ విషం ఒక్క  చుక్క కూడా ఉండరాదని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు 14 వేల టన్నుల స్టైరిన్ ని దఫదఫాలుగా దక్షిణ కొరియాకు తరలించేశారు. సరే విశాఖకు విషం బాధ తప్పిందా. అంటే ఇంకా ఉందనే వైసీపీ నేతలు అంటున్నారు.

అవును మరి.. అది రాజకీయ విషం.  స్టైరిన్ కంటే ప్రమాదమైనది. బాధితులకు పరిహారం దక్కింది. గ్యాస్ లీకేజ్ ప్రభావిత ప్రాంతాలలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయినా కూడా అక్కడకు వెళ్ళి విష రాజకీయం చేద్దామనుకున్న వారితోనే అసలైన ముప్పు పొంచి ఉందిపుడు అంటున్నారు.

మళ్ళీ గత జీవితంలోకి వెళ్తున్న వారిలో లేని పోని భయాలను రెచ్చగొడుతూ సరికొత్త డిమాండ్లు పెడుతూ అక్కడి గ్రామస్తులలో భయం నింపుతున్న విష రాజకీయం మాత్రం అక్కడే ఇంకా ఉండిపోయింది. స్టైరిన్ మొత్తం తరలించేశాక కూడా ఇంకా జనాలను వణికిస్తున్న  విష రాజకీయాన్ని ఎలా తరలిస్తారో, ఎలా అదుపులోకి తెస్తారో తెలియదు.

కానీ అక్కడి జనాలను ప్రతీ రోజూ  చస్తూ బతికేలా చేస్తూ అందులో తమ భావి రాజకీయానికి బాటలు వేసుకోవాలని చూస్తున్న  విష రాజకీయం మాత్రం స్టైరిన్ కంటే దారుణమే. దీన్ని కనుక కట్టడి చేయకపోతే ఎప్పటికీ విశాఖ ఈ  విషంతో కలసి ఉండాల్సివస్తుంది.

విద్యుత్‌ బిల్లులపై ప్రతిపక్షం దుష్ప్రచారం