‘డార్లింగ్’ కాన్సెప్ట్ అదిరింది-నాని

ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటించిన యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన…

ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటించిన యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రం జూలై 19న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. నేచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. డార్లింగ్ టీజర్ ట్రైలర్ చాలా ఎంటర్ టైనింగ్ గా వున్నాయి. ఈ మధ్య యాక్షన్ సినిమాలు ఎక్కువైపోయి కామెడీ, లవ్ స్టొరీలని మిస్ అవుతున్నాం. లవ్ స్టొరీ, కామెడీ కలిపి డార్లింగ్ తో వస్తున్నారు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి. స్ల్పిట్ పర్సనాలిటీ కాన్సెప్ట్ అదిరిపోయింది. లేడి అపరిచితుడు. ఇలాంటి కాన్సెప్ట్ తో సరిగ్గా చేస్తే ఎంత లాఫ్టర్ జనరేట్ చేయొచ్చో వూహించగలను.. అన్నారు.

ట్రైలర్ చూస్తుంటే పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ అనిపిస్తుంది. ఈ శుభ సందర్భంలో మీతో ఒక విషయం చెప్పాలి. నా వాల్ పోస్టర్ బ్యానర్ నెక్స్ట్ సినిమాలో దర్శినే హీరో. జగదీశ్ ఈ మూవీకి డైరెక్టర్. జానర్ మిగతా వివరాలు త్వరలో చెప్తాం. డార్లింగ్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అన్నారు నాని.

హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి రావాలనుకునే ఇప్పటి జనరేషన్ కి నాని అన్న ఇన్స్పిరేషన్. దర్శ‌కుడు అశ్విన్ రూపంలో నాకో బ్రదర్ దొరికాడు. డార్లింగ్ తో తెలుగు సినిమా అశ్విన్ ని అడాప్ట్ చేసుకుంటుంది. తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నిరంజన్ , చైతన్య ఈ కథని నమ్మారు. వారితో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకుడు ఇచ్చిన టైమ్ కి వాల్యూ యాడ్ చేయాలని అనుకుంటా. ఒక మంచి సినిమా మీకు మళ్ళీ తిరిగివ్వాలి. మీరు మాకిస్తున్న ప్రేమని రెండితలు తిరిగివ్వాలని నేను అనుకుంటున్నాను. జూలై 19. మీతో కమ్యునికేట్ చేస్తా, మిమ్మల్ని ఎంగేజ్ చేస్తా. మీరు థియేటర్ కి వస్తే మా టీం తరపున మీరు అనుకున్నదాని కంటే ఎక్కువ ప్రేమ ఇస్తా.. ఐ లవ్ యూ అల్’ అన్నారు.

డైరెక్టర్ అశ్విన్ రామ్ మాట్లాడుతూ.. నాని ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా వుంది. కొత్త దర్శకులకు కొత్త కథలు రాసుకునే స్ఫూర్తిని నమ్మకాన్ని ఇచ్చే హీరో నాని . డార్లింగ్ టీం అందరికీ పేరుపేరునా థాంక్స్ యూ. మా ప్రొడ్యూసర్స్ చాలా సపోర్ట్ చేశారు. డార్లింగ్ నాకు చాలా స్పెషల్ ఫిలిం. డార్లింగ్ లో కొత్త నభాని చూస్తారు. దర్శి సపోర్ట్ మర్చిపోలేను. కంటెంట్ ని చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేశారు. తన ఎదుగుదల చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. జూలై 19న సినిమా వస్తుంది. తప్పకుండా చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు.

హీరోయిన్ నభా నటేష్ మాట్లాడుతూ.. నానికి గారిని నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయన ఈ ఈవెంట్ కు రావడం చాలా ఆనందంగా వుంది. డార్లింగ్ సినిమా నాకు ఓ ఎమోషన్. ఇందులో నా డ్రీం రోల్ చేశాను. అశ్విన్ అద్భుతమైన స్క్రిప్ట్ రాశారు. ఇంకా గొప్పగా తీశారు అన్నారు.

నిర్మాత చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. నాని కి థాంక్స్. మా సినిమాకి సపోర్ట్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ పేరుపేరునా థాంక్స్. దర్శి అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. నభా కోసం రిలీజ్ తర్వాత స్పెషల్ గా ఈవెంట్ పెడతాను. ఈ సినిమా చూసిన తర్వాత తను హార్డ్ వర్క్ ని అందరూ అభినందిస్తారు. మా ప్రొడక్షన్ తో తనతో మరిన్ని సినిమాలు చేయాలని వుంది. అనన్య థాంక్ యూ. డార్లింగ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అశ్విన్ మరో ట్యాలెంటెడ్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకుంటారు. ఇది టీం వర్క్, మీ అందరి సపోర్ట్ కి థాంక్ యూ’అన్నారు.