నాని సరసన జాన్వి కపూర్

ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ కు మరో రెండు సినిమాలు వచ్చేసాయి. Advertisement ఎన్టీఆర్ తో దేవర సినిమా చేస్తుండగానే రామ్ చరణ్ తో సినిమా ఓకె…

ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ కు మరో రెండు సినిమాలు వచ్చేసాయి.

ఎన్టీఆర్ తో దేవర సినిమా చేస్తుండగానే రామ్ చరణ్ తో సినిమా ఓకె అయింది. త్వరలో సెట్ మీదకు వెళ్లబోతోంది. ఇప్పుడు మరో సినిమా కు కూడా జాన్విని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నాని- దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మించే సినిమాకు జాన్వి కపూర్ ను హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

నాని చాలా ఇంట్రస్టింగ్ వున్నారు ఈ సినిమా సబ్జెక్ట్ మీద. ఇమ్మీడియట్ గా చేయబోయే సినిమా ఇదే. దసరా సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసారు. నానికి మంచి పేరు వచ్చింది. అందుకే మళ్లీ మరో అవకాశం ఇచ్చాడు దర్శకుడు శ్రీకాంత్ కు. ఇది కూడా భారీ గా తీయాల్సిన వైవిధ్యమైన సబ్జెక్ట్ నే. పాన్ ఇండియా సినిమానే. అందుకే జాన్విని తీసుకుంటే బాలీవుడ్ లో కూడా క్రేజ్ వస్తుంది.

అందుకే ఈ ఆలోచనతోనే జాన్విని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న సరిపోదా శనివారం తరువాత నాని చేసే సినిమా అదే.