జాన్వి కపూర్ రెమ్యూనిరేషన్.. అమ్మో!

తెలుగు హీరోయిన్ల రెమ్యూనిరేషన్లు ఎంత వరకు వుంటాయి? మహా అయితే పది లక్షల నుంచి రెండు కోట్లు. అదే నయనతార, త్రిష లాంటి వాళ్లు అయిదు నుంచి పది కోట్లు. Advertisement కానీ ఇప్పుడు…

తెలుగు హీరోయిన్ల రెమ్యూనిరేషన్లు ఎంత వరకు వుంటాయి? మహా అయితే పది లక్షల నుంచి రెండు కోట్లు. అదే నయనతార, త్రిష లాంటి వాళ్లు అయిదు నుంచి పది కోట్లు.

కానీ ఇప్పుడు పాన్ ఇండియా మోజు నడుస్తోంది. అందుకోసం బాలీవుడ్ హీరోయిన్లను తీసుకోవాలి. మృణాళ్ లాంటి వారు మూడు నుంచి నాలుగు కోట్లు తీసుకుంటారని టాక్.

ప్రస్తుతం జాన్వి కపూర్ టైమ్ నడుస్తోంది. మరి ఇంతకీ ఆమె ఎంత రెమ్యూనిరేషన్ తీసుకుంటుంది. డిమాండ్ చేయడం ఎనిమిది కోట్లు. కానీ ఒప్పుకోవడం సినిమాను బట్టి. రామ్ చరణ్- బుచ్చిబాబు సినిమాకు సెటిల్ అయింది మూడున్నర కోట్లు అని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఇప్పుడు నాని సినిమా కోసం జాన్విని సంప్రదిస్తున్నారు.

ఎంతకు సెటిల్ అవుతుందో అన్నది తెలియదు. రామ్ చరణ్, మైత్రీ సంస్థ కనుక మూడున్నర దగ్గర సెటిల్ అయింది. నాని హీరో కనుక మరో యాభై లక్షలు లేదా కోటి రూపాయలు అదనంగా అడిగే అవకాశం వుందని తెలుస్తోంది. అంటే స్టాఫ్, ఖర్చులు అన్నీ కలిసి అయిదు కోట్లు దాటేస్తుందన్న మాట.