రాజ్ తరుణ్ తన భర్త అంటూ లావణ్య ఇచ్చిన కంప్లయింట్ తో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు, తాజాగా అతడికి నోటీసులు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి 18వ తేదీలోగా పోలీస్ స్టేషన్ కు హాజరుకావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. దీనిపై రాజ్ తరుణ్ స్పందించాల్సి ఉంది.
రాజ్ తరుణ్ తో తను 11 ఏళ్లుగా కాపురం చేస్తున్నానని, గుడిలో తామిద్దరం పెళ్లి కూడా చేసుకున్నామని, కొన్నేళ్ల కిందట తనకు అబార్షన్ కూడా చేయించాడంటూ లావణ్య ఆరోపించిన సంగతి తెలిసిందే. మాల్వీ మల్హోత్రా అనే హీరోయిన్ పరిచయంతో రాజ్ పూర్తిగా మారిపోయాడని, తన భర్తను తిరిగి తనకు అప్పగించాలని కోరుతూ ఆమె పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది.
దీనిపై స్పందించిన రాజ్ తరుణ్, తనకు లావణ్యకు ఎలాంటి శారీరక సంబంధం లేదని ప్రకటించాడు. ఈ వివాదాన్ని లీగల్ గానే ఎదుర్కొంటానని తేల్చిచెప్పాడు. ఆ వెంటనే లావణ్య కూడా లాయర్ ను పెట్టుకుంది. అతడి ద్వారా ప్రాపర్ గా పోలీస్ కంప్లయింట్ ఇచ్చి, అన్ని సాక్ష్యాలు సమర్పించింది. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు, రాజ్ తరుణ్ ను విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీచేశారు.
నిరాహార దీక్షకు దిగబోతున్న లావణ్య..
మరోవైపు ఈ వివాదానికి సంబంధించి లావణ్య నిరాహార దీక్షకు దిగబోతోంది. మాల్విని రాజ్ తరుణ్ వదిలేయాలని, రాజ్ తరుణ్ తనను భార్యగా అంగీకరించాలని, మాల్వి కుటుంబంపై చర్యలు తీసుకోవాలనే 3 డిమాండ్లతో ఆమె నిరాహార దీక్షకు దిగబోతోంది.
మాల్వి నిజస్వరూపం ఇదేనా..?
మరోవైపు మాల్వికి ఇలాంటి ఎపైర్లు కొత్త కాదంటూ మరో కోణం వెలుగులోకి వచ్చింది. గతంలో ఆమె యోగేష్ అనే వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉందని, అతడి ఆస్తి కాజేసి వదిలించుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వయంగా యోగేశ్ తల్లి ఈ ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేసింది. యోగేష్, మాల్వి మాట్లాడుకున్న కాల్ రికార్డింగ్స్ కూడా ఆమె విడుదల చేయడం విశేషం.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి యోగేష్ ను మోసం చేసిందట మాల్వి. దీంతో యోగేష్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ కేసులో అతడు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.