రాజు కన్నా మొండి వాడు బలవంతుడు అన్నది పెద్దల మాట. అలాంటి మొండివాడి కన్నా దర్శకుడు శంకర్ బలవంతుడు అనుకోవాలి. ఆ మాటకు వస్తే శంకర్ అనే కాదు, పెద్ద దర్శకులు అంతా ఇంతే.
తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనుకునే రకం. వాళ్లు అనుకున్నదే చేస్తారు. పెద్ద దర్శకులతో సినిమా చేయకపోతే ఓ సమస్య. చేస్తే మరో సమస్య. మంచి హిట్ రావాలి. పేరు రావాలి. ఇమేజ్ పెరగాలి అంటే పెద్ద దర్శకులతో సినిమా చేయాలి. కానీ అలా చేయాలంటే వాళ్లు చెప్పినట్లే చేయాలి తప్ప పక్కకు జరగరు.
దర్శకుడు శంకర్ గేమ్ ఛేంజర్ సంగతే తీసుకోండి. ఎప్పుడు అప్ డేట్ వస్తుందో తెలియదు. ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ఎంత ఖర్చు అవుతోందో లెక్క వుండదు. ఇటీవల ఇండియన్ 2 వచ్చింది. తొలి రోజే డిజాస్టర్ టాక్ మూటకట్టుకుంది. 20 నిమిషాల మేరకు ట్రిమ్ చేస్తున్నామని సమాచారం అందింది. కానీ ఈ రోజుకు ట్రిమ్ చేసిన వెర్షన్ మాత్రం థియేటర్ లోకి రాలేదు. ఇప్పటికీ గేమ్ ఛేంజర్ ఈ ఏడాది విడుదల చేస్తారా అనే ప్రశ్నకు సమాధానం లేదు.
దర్శకుడు సుకుమార్ కు హీరో బన్నీకి మధ్య అసంతృప్తి పరిస్థితి నెలకొందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సినిమా ఆలస్యం కావడమే దీనికి కారణం. కానీ హీరో బన్నీ ఏమీ చేయలేని పరిస్థితి. గతంలో వన్ నేనొక్కడినే టైమ్ లో కూడా దర్శకుడు సుకుమార్ మాట చెల్లు బాటు మీద వార్తలు వినిపించాయి.
ఆచార్య టైమ్ లో కొరటాల శివ కు మెగాస్టార్ కు మధ్య ఇదే పరిస్థితి. తాను అనుకున్నదే తీసారు. తాను అనుకున్నదే చేసారు అని వార్తలు వచ్చాయి. ఫలితం తెలిసిందే.
గుంటూరు కారం టైమ్ లో దర్శకుడు త్రివిక్రమ్ కు హీరో మహేష్ బాబు కు మధ్య ఇలాంటి క్రియేటివ్ డిఫరెన్స్ లే వచ్చాయని అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి.
ఏజెంట్ సినిమా టైమ్ లో దర్శకుడు సురేందర్ రెడ్డి తను అనుకున్నదే చేసారు. నిర్మాత అనిల్ సుంకర మౌనంగా వుండడం తప్ప ఏమీ చేయలేకపోయారు. అంతకు ముందు సైరా సినిమా సమయంలో కూడా సురేందర్ రెడ్డి వ్యవహార తీరు మీద అనేక కబుర్లు వినిపించాయి.
టాలీవుడ్ లో ఇంకా మరి కొందరు దర్శకులు కూడా ఇంతే.. తాము అనుకున్నదే చేస్తారు. అయితే ఎక్కువ మంది దర్శకులు ఖర్చు పెంచేస్తారు అనే అపవాదే వుంది టాలీవుడ్ లో. కానీ దాని వల్ల నిర్మాతలకు సమస్య తప్ప హీరోలకు కాదు. ఇలా ఖర్చు పెంచే దర్శకుల జాబితా చాలా పెద్దది టాలీవుడ్ లో.
కానీ అలా కాకుండా సినిమాను తమ చిత్తానికి చెక్కుతూ, హీరో మాట వినకుంటేనే సమస్య. ఫలితం ఎలా వున్నా సరే. కానీ దాని వల్ల హీరోలు ఇబ్బంది పడతారు. హిట్ అయితే హీరోకే పేరు. ఫ్లాప్ అయినా హీరోకే మైనస్ కదా.
జనం పట్టించుకోరు
థియేటర్ కన్నా ఓటిటి మంచిది