Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సినీ, రాజకీయ వర్గాల్లో ‘తార’ ప్రకంపనలు

సినీ, రాజకీయ వర్గాల్లో ‘తార’ ప్రకంపనలు

నా ఆత్మకథతో సినిమా తీస్తానంటూ తారా చౌదరి చేసిన ప్రకటనతో ఒక్కసారిగా సినీ, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు షురూ అయ్యాయి. రచయిత చిన్నికృష్ణతో తారా చౌదరికి సన్నిహిత సంబంధాలున్నాయి. అది కాకుండా సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ కొందరు యువతుల్ని బలవంతంగా వ్యభిచారం రొంపిలోకి దింపిందనే ఆరోపణలు కూడా ఆమె చుట్టూ అనేకం ఆ మధ్య విన్పించాయి. అదంతా ఉత్తదేనని తారా చౌదరి అప్పట్లో ఖండిరచిందనుకోండి.. అది వేరే విషయం.

ఆ వివాదం సమయంలో తారా చౌదరి కొన్ని ఆడియో టేపుల్ని మీడియా ముందుంచింది. ఓ పోలీస్‌ అధికారి, ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి సంభాషణల్ని వ్యూహాత్మకంగా రికార్డ్‌ చేయించి, సంచలనం సృష్టించింది తారా చౌదరి. ఆమె ఇప్పుడు సినిమా తానే స్వయంగా తీస్తోందంటే, అది తన ఆత్మ కథ అని ఆమె చెప్పడమంటే ఆషామాషీ వ్యవహామేమీ కాదు. పైగా ఆ రాజకీయ నాయకుడెవరో కాదు, రాయపాటి సాంబశివరావు కావడం గమనార్హం. ‘అదంతా నాన్సెన్స్‌..’ అని రాయపాటి కొట్టిపారేశారుగానీ, సినిమా పేరుతో తన ఆత్మకథని ఆమె ఎలాగైనా తెరపై చూపించుకోవచ్చుగనుక, ఇంకెంతమంది రాజకీయ ప్రముఖుల్ని, సినీ ప్రముఖుల్ని, ఇతర రంగాలకు చెందిన వ్యక్తుల్ని సినిమా ద్వారా ఇరకాటంలో పడేస్తుందోనని తారా చౌదరి గురించి చర్చించుకుంటున్నారు.

ఇంత చర్చ జరుగుతోందంటే, తారా చౌదరి తాను చేసిన పబ్లిసిటీ స్టంట్‌లో సక్సెస్‌ అయినట్లే. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో సంపాదించనోళ్ళలో చాలామంది సినిమాల్లోకొచ్చారు.. పెద్ద పెద్ద నిర్మాతలుగానూ ఎదిగారు. తారా చౌదరి కూడా రియల్‌ ఎస్టేట్‌లో సంపాదించానని చెబుతోంది. ఏమో కాలం కలిసొస్తే, బండ్ల గణేష్‌లా తారా చౌదరి కూడా పెద్ద ప్రొడ్యూసర్‌ అయిపోతుందేమోగానీ, బండ్ల గణేష్‌ చాలా సౌమ్యుడు. తారా చౌదరి అలా కాదు. అదే ఇక్కడ ఆమెతో గతంలో పరిచయాలున్న చాలామందికి ఇబ్బంది కలిగిస్తోన్న విషయం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?