మగజాతి ఆణిముత్యం..కమెడియన్ సప్తగిరి. కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోకపోయిన నటుల్లో సప్తగిరి ఒకరు. హీరోగా సెటిల్ కావాలనే ప్రయత్నం. అలా అని చిన్న చిన్న వన్ టూ మినిట్స్ కామెడీ రోల్స్ వదులుకోకపోవడం ఇలా అన్ని రకాలుగా వెనక్కు వెళ్లిపోయాడు. ఇప్పుడు అన్నీ పక్కన పెట్టి సీరియస్ గా మంచి కంటెంట్ వెదుక్కుని హీరోగా మరోసారి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా చేసిన సినిమా పెళ్లి కాని ప్రసాద్. ఈ సినిమా దాదాపు పూర్తయింది. సమ్మర్ లో విడుదలకు సిద్ధం అవుతోంది.
ఇప్పుడు ఈ సినిమా పబ్లిసిటీ కిక్ స్టార్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఫస్ట్ లుక్ ను వదిలారు. ఈ ఫస్ట్ లుక్ లో సప్తగిరి రకరకాల హావభావాలను ఒకే ఇమేజ్ లోకి తెచ్చారు. అంతకు మించి ఏమీ చెప్పలేదు. జస్ట్ ఫస్ట్ లుక్ అంతే. అయితే కట్నంవారి శాసనాల గ్రంధం అనే బుక్ దాన్ని చదువుతున్న సప్తగిరి, దాన్ని వింతంగా రకరకాల హావభావాలతో చూస్తున్న సప్తగిరి అనేకానేక ముఖ కవళికల మేరకు ఇందులో ఏదో విషయం వుందనుకోవాలి.
నిజానికి ఇదే పెద్ద హీరోలకు అయితే సినిమా సినిమాకు గెటప్ మారుతుంది కనుక ఫస్ట్ లుక్ కు ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి ఉంటుంది. కానీ ఇక్కడ సప్తగిరి జస్ట్ ఎలా వుంటాడో, అలా ఫస్ట్ లుక్ వదిలారంతే. నిజానికి ఈ రేంజ్ సినిమాలకు ఫస్ట్ లుక్ కన్నా గ్లింప్స్ లాంటివి ప్లాన్ చేస్తే వేరుగా వుంటుంది. ఈ కట్నం వారు..శాసనాల గ్రంధం ఇవన్నీ అప్పుడు రిజిస్టర్ అవుతాయి. కానీ హీరో అనగానే ఆలోచనలు వేరుగా ఉంటాయి. దానికి మనమేం చేయలేము.
మొత్తానికి సప్తగిరి మళ్లీ తెరమీద కాస్త గ్యాప్ తరువాత కనిపించబోతున్నాడు. అదీ విషయం.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,