అసెంబ్లీ స‌మావేశాల‌కు కాషాయ వస్త్రాల్లోనే!

హిందుత్వ రాజ‌కీయాల్లో బీజేపీ వాళ్ల‌కంటే ప‌వ‌న్ మించిపోయార‌నేందుకు… ఇటీవ‌ల ఆయ‌న వేష‌భాష‌ల్లో వ‌చ్చిన మార్పును ఉద‌హ‌రిస్తున్నారు.

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ కాషాయ వ‌స్త్రాల్లో హాజ‌ర‌య్యారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొంత కాలంగా స‌నాత‌నం అంటూ మ‌త‌ప‌ర‌మైన అంశాల్ని ఎక్కువ‌గా మాట్లాడుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఆయ‌న త‌మిళ‌నాడు, కేర‌ళ రాష్ట్రాల్లో ప‌లు దేవాల‌యాల‌ను సంద‌ర్శించారు. ఆల‌యాల సంద‌ర్శ‌న స‌మ‌యంలో కాషాయ వ‌స్త్ర‌ధార‌ణ‌ను అర్థం చేసుకోవ‌చ్చు.

కానీ అసెంబ్లీ స‌మావేశాల‌కు కూడా ఆ వ‌స్త్రాల్లోనే వెళ్ల‌డం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగిఆదిత్య కూడా ఎప్పుడూ కాషాయ వ‌స్త్రాల్లోనే క‌నిపిస్తారు. ఆయ‌నంటే స‌న్యాసి. కానీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ అలా కాదే! ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎంను ఆద‌ర్శంగా తీసుకున్న‌ట్టున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

అయితే ఎలాంటి వ‌స్త్రాలు ధ‌రించాల‌న్న‌ది వ్య‌క్తిగ‌తం. త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. కానీ ఒక్క‌సారిగా మార్పు రావ‌డంతోనే ప‌లు ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. మ‌తాలు, కులాల‌కు అతీతంగా రాజ‌కీయాలు చేయ‌డ‌మే జ‌న‌సేన ల‌క్ష్యంగా మొద‌లైన ప‌వ‌న్ రాజ‌కీయ ప్ర‌స్థానం… ఆ త‌ర్వాత కాలంలో పూర్తి భిన్న‌మైన ధోర‌ణిలో వెళుతుండ‌డం నిల‌దీత‌కు గురి చేస్తోంది.

ప‌వ‌న్ మాట‌ల‌కు, చేత‌ల‌కు పొంత‌న వుండ‌ద‌నేది బ‌ల‌మైన విమ‌ర్శ‌. ఇటీవ‌ల ఢిల్లీ సీఎం ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో ప‌వ‌న్‌ను కాషాయ వ‌స్త్రాల్లో చూసిన ప్ర‌ధాని మోదీ… హిమాల‌యాల‌కు వెళ్తున్నారా? అని స‌ర‌దాగా ప్ర‌శ్నించ‌డం తెలిసిందే. హిందుత్వ రాజ‌కీయాల్లో బీజేపీ వాళ్ల‌కంటే ప‌వ‌న్ మించిపోయార‌నేందుకు… ఇటీవ‌ల ఆయ‌న వేష‌భాష‌ల్లో వ‌చ్చిన మార్పును ఉద‌హ‌రిస్తున్నారు.

26 Replies to “అసెంబ్లీ స‌మావేశాల‌కు కాషాయ వస్త్రాల్లోనే!”

      1. We were watching trending videos like “Super Six” and “Sampadha Srushtistha,” along with an incredible video that showed how to mortgage AP for 500 crores per day—amassing a total of 130,000 crores over a record-breaking eight months by Bolli.

      2. We were watching trending వీడిYOS like “Super Six” and “Sampadha Srushtistha,” along with an incredible వీడిYO that showed how to mortgage AP for 500 కోట్లు per day—amassing a total of 130,000 కోట్లుover a record-breaking eight months by Bolli.

  1. దేవాలయానికి వెళ్లడం

    దేవాలయాన్నే ఇంటికి తెప్పించుకోవడం

    బోత్ ఆర్ నాట్ సేమ్

  2. I m a communist, ambetkar , Che Guevara and now Hindu park rakshaka. What’s wrong? I m god and have different faces . People and fans as well as my caste fanatics treat me as whatever I pretend to be. What’s the problem to you GA? As per my convenience, I play roles and question always YSRCP government. Why should I question our friends and why I need to run false propaganda

Comments are closed.