హిట్ 3-వయిలెంట్ టీజర్

టీజర్ మొత్తం హీరో క్యారెక్టరైజేషన్, డబుల్ షేడ్ అనేది మాత్రమే వుంది. హిట్ తొలి రెండు సిరీస్ ల్లో మాదిరి కేస్ ను పెద్దగా ప్రస్తావించలేదు.

హీరో నాని లేటెస్ట్ సినిమా హిట్ 3. హిట్ సినిమాల సిరీస్ లో మూడో సినిమా. థర్డ్ కేస్. తొలి రెండు సినిమాలకు లేదా తొలి రెండు కేస్ లకు ఈ మూడో కేస్ కు చాలా తేడా కనిపిస్తోంది. తొలి రెండు కేస్ ల కథలు కేవలం పరిశోధనకు ప్రాధాన్యత ఇస్తూ నడిచాయి. కానీ ఈ కేస్ లో హీరో క్యారెక్టరైజేషన్ కు ప్రాధాన్యత ఇస్తూ నడిపించినట్లు కనిపిస్తోంది. అర్జున్ సర్కార్ అనే వయిలెంట్ పోలీస్ ఆఫీసర్ కథే కీలకం. అతగాడు చేసిన ఓ కేస్ పరిశోధన దీనికి ఆలంబన. హీరో నాని పాత్రకు రెండు షేడ్స్ వున్నట్లు టీజర్ లో క్లారిటీ ఇచ్చారు.

హిట్ 3 ఫుల్ బ్లడ్ షెడ్ తో టూ వయిలెంట్ గా వుండబోతోందని గతంలోనే వార్తలు వచ్చాయి. హీరో నాని కూడా కొన్ని ఇంటర్వూల్లో హింట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ విషయంలో మరింత క్లారిటీ ఇచ్చేసారు. హీరో నాని కి వున్న ఫ్యామిలీ ఇమేజ్ ప్రకారం చూసుకుంటే ఇంత రక్తపాతాన్ని చూడడం కాస్త కష్టం. అయితే ఇప్పుడున్న ట్రెండ్ వేరు. ఆనిమల్, కిల్ వంటి సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. అందువల్ల జనం టేస్ట్ మారుతూ వుంటే, నాని ఆ దిశగా ప్రయత్నిస్తూ వుండొచ్చు.

టీజర్ మొత్తం హీరో క్యారెక్టరైజేషన్, డబుల్ షేడ్ అనేది మాత్రమే వుంది. హిట్ తొలి రెండు సిరీస్ ల్లో మాదిరి కేస్ ను పెద్దగా ప్రస్తావించలేదు. జస్ట్ ఓ సీరియల్ మర్డర్ కేస్ అన్న హింట్ ఇచ్చారు. ఈ సినిమా మే 1న విడుదల కాబోతోంది.

One Reply to “హిట్ 3-వయిలెంట్ టీజర్”

Comments are closed.