దసరా 2 సినిమా అనౌన్స్ చేసి రోజులు గడచిపోతున్నాయి. సెట్ వర్క్ జరుగుతోంది. అది కీలకం. అది పూర్తయితేనే సినిమా స్టార్ట్ అవుతుంది. పెద్ద సినిమా. భారీ బడ్జెట్ సినిమా. టైమ్ పడుతుంది. అందుకే హీరో నాని ముందుగా మరో సినిమా చేసేయాలనే ఆలోచనతో మైత్రీ మూవీ మేకర్స్‌కు మరో సినిమాకు ఓకె చెప్పేసారు.
ఈ సినిమా, ఆ సినిమా పారలల్‌గా చేయడానికి వీలు అవుతుందా అన్నదే అనుమానం. ఎందుకంటే, దసరా 2 సినిమా డిఫరెంట్ సినిమా. నాని గెటప్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది.
మైత్రీ మూవీస్-శిబి చక్రవర్తి కాంబినేషన్‌లో నాని సినిమా చేయబోతున్నారు. అది రెగ్యులర్ ఎంటర్‌టైనర్. మరీ ఎక్కువ లాంగ్ టైమ్ తీసుకునే సినిమా కాదు. అందుకే ఆ సినిమాను ముందుగా చేసేసి 2025లో విడుదల చేసే ఆలోచనలో నాని ఉన్నారు. అలా చేస్తే ఈ ఏడాది రెండు సినిమాలు వచ్చినట్లు అవుతుంది. లేదంటే, ఈ ఏడాదికి హిట్ సిరీస్ ఒకటే సినిమా అవుతుంది. పైగా, అది స్వంత సినిమా. అదే మైత్రీ సినిమా చేస్తే, 30 కోట్ల మేరకు రెమ్యూనిరేషన్ ఈ ఏడాదే వస్తుంది.
కానీ దీని వల్ల దసరా 2 మరింత ఆలస్యం అవుతుంది. ఇప్పటికే ఆ సినిమా మీద చాలా ఖర్చు పెడుతున్నారు. భారీ సెట్. అడ్వాన్స్‌లు, ఆఫీసు ఖర్చులు ఒకటి కాదు. అసలే దసరా సినిమా లాభాలేమీ తెచ్చి పెట్టలేదు. అందువల్ల నిర్మాతకు కొంచెం కష్టం.
Good story
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,