మొదటి రోజే వన్ ప్లస్ వన్ ఆఫర్

అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్, భూమి పడ్నేకర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ఓ సెక్షన్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది.

సాధారణంగా సినిమాలకు రిలీజైన వారం తర్వాత ఆఫర్లు నడుస్తుంటాయి. టాక్ బాగా లేకపోతే ఫస్ట్ వీకెండ్ పూర్తయిన వెంటనే ఆఫర్లు మొదలుపెడతారు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకు మాత్రం రిలీజ్ రోజు నుంచే 1+1 ఆఫర్ పెట్టారు. అంటే ఒకటి టికెట్ కొంటే మరో టికెట్ ఉచితం అన్నమాట.

ఈరోజు రిలీజైన “మేరీ హజ్బెండ్ కి బీవీ” సినిమాకు ఏకంగా అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే ఈ ఆఫర్ పెట్టడం విశేషం. దీనికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. ప్రస్తుతం నార్త్ బెల్ట్ లో సాధారణ సినిమాల్ని చూడడం తగ్గించేశారు జనం. దీనికి తోడు ఛావా సినిమా బ్రహ్మాండమైన హిట్టయింది.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రేక్షకుల్ని తమవైపు తిప్పుకునేందుకు మొదటి రోజు నుంచే ” ఒక టికెట్ కు ఇంకో టికెట్ ఫ్రీ” పెట్టాల్సిందే. అదే పనిచేశారు మేకర్స్. అయితే ఫలితం మాత్రం అంతంతమాత్రమే.

అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్, భూమి పడ్నేకర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ఓ సెక్షన్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. హీరోహీరోయిన్లు నవ్వించడానికి చాలా కష్టపడ్డారని, రైటింగ్ బాగాలేదని సమీక్షలు వస్తున్నాయి. భయంకరమైన పీఆర్ కు పెట్టింది పేరైన బాలీవుడ్ లో ఈ సినిమా పూర్తి ఫలితం తేలాలంటే మరుసటి రోజు వరకు వెయిట్ చేయాల్సిందే.

5 Replies to “మొదటి రోజే వన్ ప్లస్ వన్ ఆఫర్”

Comments are closed.