ఆమెకు రూ.3 కోట్లు ఇచ్చారంట!

డాకు మహారాజ్ సినిమాలో హీరోయిన్ కు, పైగా ఫుల్ లెంగ్త్ లేని పాత్రకు 3 కోట్లు ఇచ్చారంటే అస్సలు నమ్మశక్యంగా లేదు.

‘డాకు మహారాజ్’ సినిమా చూసినవాళ్లకు అందులో ఊర్వశి రౌతేలా పాత్ర ఏంటి, ఆ పాత్ర నిడివి ఎంత అనే విషయం గుర్తుండే ఉంటుంది. తొలి భాగంలో కొన్ని సన్నివేశాలతో పాటు ‘దబిడి దిబిడి’ పాటలో కనిపించింది ఊర్వశి.

వీటితో పాటు ఓ యాక్షన్ బ్లాక్ లో చిన్న పైట్ చేసింది. ఆమె పాత్ర అక్కడితో ముగిసింది. సెకండాఫ్ లో ఆమె చిన్న ఫ్రేమ్ లో కూడా కనిపించలేదు. ఈ పాత్ర కోసం ఊర్వశి రౌతేలాకు ఏకంగా 3 కోట్ల పారితోషికం ఇచ్చారనే ప్రచారం బాలీవుడ్ లో జోరుగా నడుస్తోంది.

టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి క్రేజ్ తో కొనసాగుతున్న మీనాక్షి, శ్రీలీల, మృణాల్ లాంటి హీరోయిన్లకు కూడా 3 కోట్లు రెమ్యూనరేషన్ లేదు. దీపిక, కియరా, జాన్వి కపూర్ లాంటి హీరోయిన్లకు బాగానే ఇస్తున్నారు. కానీ ఆ సినిమాలు వేరు, ఆ లెక్కలు వేరు. కానీ డాకు మహారాజ్ సినిమాలో హీరోయిన్ కు, పైగా ఫుల్ లెంగ్త్ లేని పాత్రకు 3 కోట్లు ఇచ్చారంటే అస్సలు నమ్మశక్యంగా లేదు.

మరోవైపు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై నెలకొన్న అనుమానాలు క్లియర్ అయ్యాయి. ఓటీటీ వెర్షన్ నుంచి ఊర్వశి రౌతేలా పోర్షన్ ను పూర్తిగా కట్ చేశారనే ప్రచారానికి తెరపడింది. డాకు మహారాజ్ స్ట్రీమింగ్ కు వచ్చింది. థియేటర్ లో నడిచిన వెర్షన్ నే యథాతథంగా ఓటీటీలో కూడా ఉంచారు. ఊర్వశి రౌతేలాకు సంబంధించి చిన్న ఫ్రేమ్ కూడా కట్ చేయలేదు.

7 Replies to “ఆమెకు రూ.3 కోట్లు ఇచ్చారంట!”

    1. లోకి మాధవ్ రెడ్డిని చూస్తే జాలి వేస్తుంది… సుపుత్రుడికి తక్కువ…. దత్తపుత్రుడికి ఎక్కువ…

Comments are closed.