బోయపాటి @ 35 కోట్లు

అఖండ 2 సినిమాకు బోయపాటి రెమ్యూనిరేషన్ 35 కోట్లు అని వినిపిస్తోంది.

దేశంలోనే ఇన్‌‌ఫ్లేషన్‌‌ పెరిగిపోతోంది, టాలీవుడ్‌లో కూడా పెరుగుతోంది. హిట్లు కొట్టే దర్శకులు, హీరోల రెమ్యూనిరేషన్ ఎక్కడో ఉంటుంది. హిట్ల మీద హిట్లు పడుతుంటే కోట్ల మీద కోట్లు పెరుగుతున్నాయి. అఖండ చేసినప్పుడు ఎడెనిమిది కోట్లు రెమ్యూనిరేషన్ నందమూరి బాలకృష్ణది అని టాక్. ఇప్పుడు అది 38 కోట్లకు చేరిందని టాలీవుడ్ వర్గాల బోగట్టా. వరుసగా హిట్లు పడడం వల్ల ఇలా మారింది.

గమ్మత్తేమిటంటే, అఖండ తరువాత స్కంధ లాంటి సినిమా చేసినా కూడా బోయపాటి క్రేజ్ తగ్గలేదు. అఖండ 2 సినిమాకు బోయపాటి రెమ్యూనిరేషన్ 35 కోట్లు అని వినిపిస్తోంది. ఇది కాస్త ఆశ్చర్యకరమైన సంగతే. అఖండ 2 కావడం, బాలయ్య-బోయపాటి సినిమాకు భయంకరమైన క్రేజ్ ఉండడం కారణం అనుకోవాలి.

బాలయ్య, బోయపాటి, థమన్, సినిమాటోగ్రాఫర్, స్టంట్ మాస్టర్లు ఇలా కీలక రెమ్యూనిరేషన్లకే 80 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది. బోయపాటి సినిమా అంటే భారీ యాక్షన్ సీన్లు ఉంటాయి. వాటికి ఓ పది కోట్లు అయినా పెట్టాల్సి ఉంటుంది.

మొత్తం మీద సినిమా బడ్జెట్ 180 కోట్ల వరకు అవుతుంది. ప్రింట్ అండ్ పబ్లిసిటీతో కలిపి అని అంచనా. రెండు వందల కోట్ల మేరకు థియేటర్… నాన్-థియేటర్ మార్కెట్ అయితే నిర్మాతలు ఫుల్ హ్యాపీగా ఉంటారు.

6 Replies to “బోయపాటి @ 35 కోట్లు”

Comments are closed.