ఏవి త‌ల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు!

ఏవి త‌ల్లీ తిరుప‌తిలో నిరుడు కురిసిన హిమ స‌మూహ‌ములు అని ఆవేద‌న‌తో ప్ర‌శ్నించుకోవాల్సిన దుస్థితి.

పుట్టిన రోజులు మ‌నుషుల‌కే కాదు, ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన ఆధ్యాత్మిక న‌గ‌రం తిరుప‌తికి ఉంది. గ‌తంలో వైసీపీ హ‌యాంలో తిరుప‌తి పుట్టిన రోజును వ‌రుస‌గా మూడేళ్ల పాటు ఘ‌నంగా నిర్వ‌హించారు. టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి సేక‌రించిన శాస‌నాల ఆధారంగా తిరుప‌తి పుట్టిన రోజు విశిష్ట‌త‌ను ప్ర‌పంచానికి చాటి చెప్పారు.

తిరుపతి నగరం క్రీ.శ.1130లో ఫిబ్రవరి 24న ఆవిర్భవించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. శ్రీ వైష్ణవ సంప్ర‌దాయాల్ని ఆచ‌రించే భగవద్ శ్రీ‌రామానుజాచార్యులు ప్రస్తుతం నగరం నడిబొడ్డున ఉన్న గోవిందరాజ స్వామి ఆలయానికి పునాది వేశారు. నాడు తిరుప‌తి న‌గ‌రానికి రామానుజాచార్యుల చేతుల మీదుగా పునాది వేయ‌డం, అనంత‌ర కాలంలో దిన‌దినాభివృద్ధి చెందుతూ వ‌చ్చింది.

సౌమ్య నామ సంవత్సరం ఉత్తరా నక్షత్రం ఫాల్గుణ పౌర్ణమి నాడు రామానుజులు గోవిందరాజుల పీఠాధిపతిని ప్రతిష్టించి, నిత్య కైంకర్యాలు చేసేశారు. నాలుగు మాడ వీధులను అగ్రహారాలతో తిరుపతి నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టారు. మొద‌ట రామానుజ‌పురంగా, ఆ త‌ర్వాత గోవింద‌రాజ ప‌ట్ట‌ణంగా పిలుచుకునేవారు. 13వ శ‌తాబ్దం నుంచి తిరుప‌తిగా పిల‌వ‌డం మొద‌లైన‌ట్టు శాస‌నాలు చెప్తున్నాయి. స‌మ‌తా ధ‌ర్మాన్ని ప్ర‌బోధించిన రామానుజాచార్యులు సంక‌ల్పించ‌క‌పోతే, నేడు హిందువుల ఆధ్మాత్మిక రాజ‌ధానిగా ఎంతో గొప్ప‌గా భావించే తిరుప‌తి న‌గ‌రం లేనేలేదు.

స్ప‌ష్ట‌మైన చారిత్ర‌క ఆధారాల‌తో తిరుప‌తి న‌గ‌రానికి పుట్టిన రోజు వేడుక‌ల్ని వైసీపీ హ‌యాంలో ప్రారంభించారు. వ‌రుస‌గా మూడేళ్ల పాటు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల్ని ప్ర‌తి ఏడాది నిర్వ‌హించాల‌ని టీటీడీ పాల‌క మండ‌లి, అలాగే తిరుప‌తి మున్సిపల్ కార్పొరేష‌న్ తీర్మానించాయి. అయితే సంస్కృతి, సంప్ర‌దాయాల‌పై ఆస‌క్తిలేని ప్ర‌జాప్ర‌తినిధులు, టీటీడీ పాల‌క మండ‌లి ఉండ‌డంతో తిరుప‌తి న‌గ‌రం ఈ ద‌ఫా పుట్టిన రోజు వేడుక‌ల‌కు దూర‌మైంది.

తిరుప‌తి పుట్టిన రోజును జ‌రుపుకోవ‌డం అంటే, మ‌న ఆధ్యాత్మిక న‌గ‌రం విశిష్ట‌త‌ను ప్ర‌పంచానికి చాటి చెప్ప‌డం. అలాగే భావిత‌రాల‌కు మ‌న న‌గ‌రం చ‌రిత్ర గురించి తెలియ‌జేయ‌డం. మూలాల‌ను విస్మ‌రించ‌డం మ‌హా ద్రోహం, పాపం కూడా. తిరుప‌తి న‌గ‌రం పుట్టిన రోజు జ‌రుపుకోక‌పోవ‌డం అంటే మ‌న మూలాల్ని మ‌న‌మే మ‌రుగున‌ప‌ర‌చ‌డం. తిరుప‌తి అంటేనే సంస్కృతి, సంప్ర‌దాయాలు, ఆధ్యాత్మిక చింత‌న‌, ఓంకార నాధం. ఇలాంటివేవీ ప‌ట్ట‌ని ప్ర‌జాప్ర‌తినిధులు, టీటీడీ పాల‌క మండ‌లి కార‌ణంగా …ఇవాళ ఆధ్మాత్మిక న‌గ‌రం వేడుక‌ల‌కు దూర‌మైంది.

చక్రవర్తిఅశోకుడెచ్చట ?
జగద్గురు శంకరుడెచ్చట ?
ఏవి తల్లీ: నిరుడు కురిసిన
హిమ సమూహములు ?

కానరారేమీ ?
పసిడిరెక్కలు విసిరి కాలం
పారిపోయినజాడలేవీ ?
ఏవి తల్లీ: నిరుడు కురిసిన
హిమ సమూహములు?

మ‌హాక‌వి శ్రీ‌శ్రీ క‌విత్వంలోని ప‌దునైన స‌మాజ మేల్కొలుపు ఫంక్తులు గుర్తు కొస్తున్నాయి. ఏవి త‌ల్లీ తిరుప‌తిలో నిరుడు కురిసిన హిమ స‌మూహ‌ములు అని ఆవేద‌న‌తో ప్ర‌శ్నించుకోవాల్సిన దుస్థితి.

8 Replies to “ఏవి త‌ల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు!”

  1. తిరుపతి నగరానికి పుట్టిన రోజు ఏమిటిరా బాబు!

    ఒక వేళా జరుపుకోవాలనుకున్నా ఆంగ్ల సంవత్సర తిథి ప్రకారం ఎలా జరుపుకుంటారురా!

    నువ్వు చెప్పిన ప్రకారమే ఫాల్గుణ పౌర్ణమికి కదా జరుపుకోవాలి?

    ఎదో కొంత మంది వెర్రోళ్ళు గత మూడేళ్ళుగా చేస్తే, మళ్ళీ అదేదో ఘనకార్యంలా ఈ ఆర్టికల్ ఒకటి!

  2. ఏంది గ్రేట్ ఆంద్ర, నిన్ననే శివాజీ, సంబాజీ చరిత్ర అంతా అబద్ధం అని రాసవు కదా.

    వేంకటేశ్వర స్వామి కూడా లేదు, అంత కల్పితం అని రాయి, మీ వాటికన్ ముఠా వాళ్ళు రోజు ప్రచారం చేస్తున్నట్లు.

  3. హిందూ విలం అని చెప్పుకునే

    జగన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సుబ్బ రెడ్డి

    హిందువుల మహ కుంభ మేళా కి వెళ్లి స్నానం చేసి వచ్చారా?

    70 కోట్లు మంది హిందువులు కదిలి వెళ్ళారు, మరి జగన్ ముఠా వెళ్ళలేదు ఏమిటి? వాటికన్ పాస్టర్ లు పర్మిషన్ ఇవ్వలేదా !

  4. తిరుమల తిరుపతి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఉంది ఉదాహరణకి శిలాతోరణం వయసు 3 లక్షల కోట్ల సంవత్సరాలు ఇలా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయ్ అవి కూడా geological scientists proved long ago.

  5. talli answer, “Bidda

    Athi manchi tanam

    athi Nijayatee valla

    Jagan chesina papamula valla

    Hima samoohamu mariyu Jagan samoohamu

    karigi poyyayi Reddy”

    deeni ne karma phalam anudru reddy. Neerajakasha vidhyardhuda !!!

Comments are closed.