అనిరుథ్ స్టామినా చాల్లేదట

రామ్ చరణ్ సినిమాకు 'కొలవరి' అనిరుద్ ను సంగీత దర్శకుడిగా అనుకున్నపుడే కొన్ని ప్రశ్నలు వినిపించాయి. అనిరుధ్ కు యూత్ పల్స్ తెలిసి వుంటే వుండొచ్చు కానీ, అచ్చ తెలుగు సినిమా మాస్ పల్స్…

రామ్ చరణ్ సినిమాకు 'కొలవరి' అనిరుద్ ను సంగీత దర్శకుడిగా అనుకున్నపుడే కొన్ని ప్రశ్నలు వినిపించాయి. అనిరుధ్ కు యూత్ పల్స్ తెలిసి వుంటే వుండొచ్చు కానీ, అచ్చ తెలుగు సినిమా మాస్ పల్స్ తెలుసా అని? మన బి సి సెంటర్లకు కావాల్సిన మాస్ బీట్ ఇస్తాడా అని..ఇప్పుడు అవే నిజమని తేలింది. 

రామ్ చరణ్ సినిమా యూనిట్ ఇచ్చిన సమయంలో వారికి కావాల్సిన అవుట్ పుట్ రాలేదని వినికిడి. సినిమా టైమ్ దగ్గర రాజీ పడేది లేదని యూనిట్ భావించడంతో, అనిరుధ్ ను పక్కకు తప్పించారు. 

నిజానికి అనిరుధ్ కు మరి కాస్త టైమ్ ఇచ్చివుంటే చేయగలిగే వాడేమో, కానీ దసరాకు ఎలాగైనా సినిమా తేవాలనుకోవడంతో వేరే సంగీత దర్శకుడిని ఎంచుకోక తప్పలేదన్నది యూనిట్ వర్గాల భోగట్టా. పోన్లెండి చేతులు కాలకుండానే ఆకులు ముందే పట్టుకున్నారు.