యాసిడ్‌ ఎటాక్‌.. ఇది కాస్త రివర్స్‌.!

ప్రేమోన్మాదుల దాడుల్లో ఇప్పటిదాకా అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడిన అబ్బాయిల్నే చూశాం. అన్ని కేసుల్లోనూ అమ్మాయిలే బలైపోతున్నారు. యాసిడ్‌ దాడి ఘటనల్లో అయితే అమ్మాయిలే బాధితులు. కానీ, సీన్‌ కాస్త రివర్సయ్యిందిక్కడ. గుంటూరు జిల్లాలోని నల్లపాడులోగల…

ప్రేమోన్మాదుల దాడుల్లో ఇప్పటిదాకా అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడిన అబ్బాయిల్నే చూశాం. అన్ని కేసుల్లోనూ అమ్మాయిలే బలైపోతున్నారు. యాసిడ్‌ దాడి ఘటనల్లో అయితే అమ్మాయిలే బాధితులు. కానీ, సీన్‌ కాస్త రివర్సయ్యిందిక్కడ. గుంటూరు జిల్లాలోని నల్లపాడులోగల ప్రభుత్వ మైనార్టీ పాలిటెక్నిక్‌ కళాశాలలో గణిత అధ్యాపకుడిక్కడ బాధితుడు.

ప్రేమించి మోసం చేశాడని ఆరోపిస్తూ, సౌజన్య అనే విద్యార్థిని, గణిత అధ్యాపకుడు వెంకటరమణపై యాసిడ్‌ దాడికి దిగింది. ఈ దాడిలో వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సౌజన్యను అదుపులోకి తీసుకున్నారు. సౌజన్య చెబుతున్నదాన్ని బట్టి, తనను ప్రేమించి మోసం చేసిన వెంకటరమణ, తనకు తెలియకుండా రహస్యంగా గత ఆగస్ట్‌లో పెళ్ళి చేసుకున్నాడట. కేసును పోలీసులు విచారిస్తే, వాస్తవాలు వెలుగు చూస్తాయి.

‘ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది.. ప్రేమించినంత మాత్రాన ప్రాణాలు తీసేస్తారా.? దాడులు చేసేస్తారా.? యాసిడ్‌ పోసేస్తారా.?’ అంటూ నిన్న మొన్నటిదాకా మహిళలపై ప్రేమోన్మాదుల దాడుల నేపథ్యంలో మహిళా సంఘాలు రోడ్డెక్కి ఆందోళనలు చేశాయి. మరిప్పుడు, వెంకటరమణపై జరిగిన దాడిపై మహిళా సంఘాలు ఎలా స్పందిస్తాయి.? అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రేమించి మోసం చేశాడు గనుక.. తగిన శాస్తి జరగాల్సిందేనని మహిళా సంఘాలు వాదిస్తాయేమో మరి.!