తాలిబన్‌ చీఫ్‌ చచ్చాడట

పాకిస్తాన్‌ సైనిక స్కూల్లోని 150 మంది విద్యార్థుల మారణహోమానికి స్కెచ్‌ వేసిన తాలిబన్‌ చీఫ్‌ మౌలనా ఫజలుల్లా చచ్చాడట. ఆప్ఘనిస్తాన్‌ సరిహద్దుల్లోగల తీవ్రవాద స్థావరాలపై పాక్‌ సైన్యం జరిపిన దాడుల్లో మౌలానా మృతి చెందినట్లు…

పాకిస్తాన్‌ సైనిక స్కూల్లోని 150 మంది విద్యార్థుల మారణహోమానికి స్కెచ్‌ వేసిన తాలిబన్‌ చీఫ్‌ మౌలనా ఫజలుల్లా చచ్చాడట. ఆప్ఘనిస్తాన్‌ సరిహద్దుల్లోగల తీవ్రవాద స్థావరాలపై పాక్‌ సైన్యం జరిపిన దాడుల్లో మౌలానా మృతి చెందినట్లు పాకిస్తాన్‌ మీడియా చెబుతోంది. అయితే దీనికి సంబంధించి పాకిస్తాన్‌ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.

ప్రపంచానికి ఉగ్ర పాఠాలు నేర్పిస్తోన్న పాకిస్తాన్‌, పెషావర్‌లోని స్కూల్‌పై తీవ్రవాదులు తెగబడేసరికి షాక్‌కి గురైంది. ప్రపంచ వ్యాప్తంగా పాకిస్తాన్‌పై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో, పాకిస్తాన్‌ తమ దేశంలోని, దేశ సరిహద్దుల్లోనూ తీవ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు షురూ చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు వంద మంది టెర్రరిస్టులు హతమయినట్లు తెలుస్తోంది.

కాగా, పెషావర్‌లో తీవ్రవాదులు విద్యార్థుల్ని కాల్చి చంపేస్తున్న సమయంలో మౌలానా, తీవ్రవాదులతో ఫోన్‌లో టచ్‌లో వున్నట్లు కొన్ని ఆడియో టేపుల్ని పాక్‌ సైన్యం ఇప్పటికే సేకరించింది. ఆ టేప్‌ల ఆధారంగా మౌలానా వుంటోన్న ప్రాంతాల్ని పసిగట్టిన సైన్యం, ఆ ప్రాంతాల్లో దాడులు చేసినట్లు పాక్‌ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. తాలిబన్‌ చీఫ్‌గా ప్రస్తుతం మౌలానా ఫజలుల్లా పనిచేస్తున్నాడు.