సునీల్ కు మరో జోడీ

వాసూవర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాకు హీరోయిన వెదుకులాటకు చాన్నాళ్లు పట్టింది. చాలా పేర్లు మారాయి. ఈ సినిమాకు సునీల్ హీరో. ఆఖరికి సంజన సిస్టర్ నిక్కీని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పుడు…

వాసూవర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాకు హీరోయిన వెదుకులాటకు చాన్నాళ్లు పట్టింది. చాలా పేర్లు మారాయి. ఈ సినిమాకు సునీల్ హీరో. ఆఖరికి సంజన సిస్టర్ నిక్కీని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పుడు మరో అమ్మాయిని కూడా ఇంకో పాత్రకు తీసుకుంటున్నారు. 

ఆ అమ్మాయి ఎవరో కాదు, యారుడా మహేష్, రోమాన్స్, గ్రీన్ సిగ్నల్, తుంగభద్ర సినిమాల్లో నటించిన డింపుల్. అంటే సునీల్ చెంతన ఇద్దరు హీరోయిన్లు అన్నమాట. ఈ సినిమాను కాస్త స్పీడ్ గానే తెరక్కెక్కిస్తున్నారు. సునీల్ సినిమా జనాలు చూసి కూడా చాలా కాలమైపోయింది కదా.