బిగ్‌ విక్టరీ.. అతి చెత్త పరాజయం.!

ఫిబ్రవరి 24.. వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ డబుల్‌ సెంచరీ బాదడంతో, జింబాబ్వేపై ఆ టీమ్‌ బంపర్‌ విక్టరీ కొట్టింది వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లలో. వరల్డ్‌ కప్‌ హిస్టరీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా…

ఫిబ్రవరి 24.. వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ డబుల్‌ సెంచరీ బాదడంతో, జింబాబ్వేపై ఆ టీమ్‌ బంపర్‌ విక్టరీ కొట్టింది వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లలో. వరల్డ్‌ కప్‌ హిస్టరీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా క్రిస్‌ గేల్‌ రికార్డులకెక్కాడు. ఏం లాభం.? జస్ట్‌ 3 రోజులు గడిచేసరికి, వెస్టిండీస్‌ అతి చెత్త పరాజయాన్ని మూటగట్టుకుంది సౌతాఫ్రికా చేతిలో.

తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 408 పరుగులు చేసింది. 409 పరుగుల టార్గెట్‌ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్‌ తడబడిరది. అలా ఇలా కాదు, 200 పరుగులు కూడా చేయలేక కుప్పకూలింది. సరిగ్గా 151 పరుగులు చేసి ఆలౌటయ్యింది విండీస్‌. గేల్‌ 3 పరుగులు చేసి, నిర్లక్ష్యంగా వికెట్‌ పారేసుకున్నాడు. చివర్లో జాసన్‌ హోల్డర్‌ అర్థసెంచరీ చేయడం మినహా వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ గురించి చెప్పుకోడానికేమీ లేదు.

ఇక, సౌతాఫ్రికా బ్యాటింగ్‌ విషయానికొస్తే, డివిలియర్స్‌ ఫాస్టెస్ట్‌ 150 నమోదు చేశాడు. జస్ట్‌ 66 బంతులు ఎదుర్కొని 162 పరుగులు రాబట్టాడు డివిలియర్స్‌. చివరి పది ఓవర్లలో సౌతాఫ్రికా 150 పరుగులు పైనే రాబట్టింది. వెస్టిండీస్‌ బౌలర్లు, డివిలియర్స్‌కి ఎక్కడ బంతులు విసరాలతో తెలియక తలపట్టుక్కూర్చున్నారు.

భారత్‌ చేతిలో ఓడిపోయిన సౌతాఫ్రికా, వెస్టిండీస్‌తో మ్యాచ్‌ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లలో ఎక్కడా ప్రత్యర్థికి అవకాశమివ్వకపోవడంతో 257 పరుగుల భారీ విజయాన్ని సౌతాఫ్రికా సొంతం చేసుకుంది.