ఏమయింది బ్రహ్మీకి..సినిమాలు కనిపించవేం?

బహ్మానందం..స్క్రీన్ మీద కనిపిస్తే చాలు నవ్వుల పువ్వులే. 2014లో 19 సినిమాల వరకు చేసాడు. వాటిల్లో సూపర్ డూపర్ హిట్ లు వున్నాయి. కానీ ఇటీవల సినిమాల్లో బ్రహ్మానందం కనిపించడం లేదు.  Advertisement డిసెంబర్,…

బహ్మానందం..స్క్రీన్ మీద కనిపిస్తే చాలు నవ్వుల పువ్వులే. 2014లో 19 సినిమాల వరకు చేసాడు. వాటిల్లో సూపర్ డూపర్ హిట్ లు వున్నాయి. కానీ ఇటీవల సినిమాల్లో బ్రహ్మానందం కనిపించడం లేదు. 

డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మూడు నెలలు గడిచాయి. బ్రహ్మానందం వున్న సినిమా చూసి. ఏమయింది? ఎందుకిలా? పైగా సీనియర్ కమెడియన్లు ప్రేక్షకుల దురదృష్టం కొద్దీ ఎవిఎస్, ధర్మవరపు, ఎమ్ ఎస్ ముగ్గురు దూరమయ్యారు. అలాంటిది మిగిలిన ఏకైక సీనియర్ బ్రహ్మానందం కూడా స్క్రీన్ కు దూరం కావడం ఏమిటి? ప్రస్తుతం బ్రహ్మానందం డైరీ ఫుల్ గా వుందా అంటే అనుమానంగానే వుంది. 

ఒక్క సుధీర్ వర్మ-నాగచైతన్య సినిమా విడుదల కావాల్సి వుంది.మరే సినిమాల్లో అయినా వున్నారో లేదో తెలియదు. అంటే మార్చిలో ఒక్క సినిమాలో మాత్రం బ్రహ్మీ కనిపించనున్నారన్నమాట. అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ రేసుగుర్రంలో కీలక పాత్ర పోషించాడు..త్రివిక్రమ్ సినిమాల్లోనూ మంచి పాత్రలు చేసాడు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో మాత్రం బ్రహ్మీ వున్నట్లుగా వార్తలు అందడం లేదు. 

బ్రహ్మీ కాస్త కాస్ట్లీ కమెడియన్ అన్నది అందిరికీ తెలిసిందే. ఆయన రోజుల లెక్కన రెమ్యూనిరేషన్ తీసుకుంటారు. రోజుకు అయిదు లక్షల వరకు తీసుకుంటారని వినికిడి. అయినా బ్రహ్మీ వుంటే నిర్మాతకు అంతకు అంతా కిట్టుబాటే. అందుకే బ్రహ్మీ మీద పాటలు కూడా పెడుతుంటారు. బ్రహ్మీని చాలా ఇష్టపడే పూరి కూడా తన తాజా సినిమా టెంపర్ లోకి తీసుకోలేదు. ఇలాంటి వార్తలు ఆమధ్య వినిపిస్తే బ్రహ్మీ తన పనైపోలేదని, తన దగ్గరకు వచ్చే సినిమాలు చేస్తూనే వున్నానని బదులిచ్చాడు. మరి ఈ పరిస్థితి ఏమిటో?