సినిమా రివ్యూ: పటాస్‌

రివ్యూ: పటాస్‌ రేటింగ్‌: 3.25/5 బ్యానర్‌: నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ తారాగణం: నందమూరి కళ్యాణ్‌ రామ్‌, శృతి సోది, సాయికుమార్‌, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌ రెడ్డి,…

రివ్యూ: పటాస్‌
రేటింగ్‌: 3.25/5

బ్యానర్‌: నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌
తారాగణం: నందమూరి కళ్యాణ్‌ రామ్‌, శృతి సోది, సాయికుమార్‌, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌ రెడ్డి, పృధ్వీ, ‘ప్రభాస్‌’ శ్రీను తదితరులు
సంగీతం: సాయి కార్తీక్‌
కూర్పు: తమ్మిరాజు
ఛాయాగ్రహణం: సర్వేష్‌ మురారి
నిర్మాత: నందమూరి కళ్యాణ్‌ రామ్‌
కథ, మాటలు, కథనం, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి
విడుదల తేదీ: జనవరి 23, 2015

‘అతనొక్కడే’ తర్వాత మళ్లీ అలాంటి సక్సెస్‌ కోసం స్ట్రగుల్‌ అవుతోన్న నందమూరి కళ్యాణ్‌ రామ్‌ మరోసారి కొత్త దర్శకుడిపై నమ్మకం ఉంచాడు. ‘అతనొక్కడే’తో సురేందర్‌ రెడ్డిలాంటి టాలెంటెడ్‌ డైరెక్టర్‌ని ఇంట్రడ్యూస్‌ చేసిన కళ్యాణ్‌ రామ్‌ ఇప్పుడు అనిల్‌ రావిపూడితో మరో నమ్మకం పెట్టుకోతగ్గ దర్శకుడిని తన బ్యానర్‌ నుంచి పరిచయం చేసాడు. ట్రెయిలర్స్‌తోనే ‘పటాస్‌’ ఉంది అనిపించిన ఈ చిత్రం ఆద్యంతం బిందాస్‌గా సాగిపోయింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ లవర్స్‌కి ఫుల్‌ డోస్‌ ఇచ్చి పంపించింది. 

కథేంటి?

కళ్యాణ్‌ సిన్హా (కళ్యాణ్‌ రామ్‌) ఏసీపీగా ఛార్జ్‌ తీసుకున్నది మొదలు… తన కింద పని చేసే పోలీసులని కూడా అవినీతికి పాల్పడమని ప్రోత్సహిస్తాడు. తప్పులు చేసే వాళ్లతో జత కలిసి తన షేర్‌ తను తీసేసుకుంటూ ఉంటాడు. ఓవైపు టీవీ జర్నలిస్టు అయిన మహతిని (శృతి సోది) ప్రేమించమంటూ వెంట పడుతూనే, మరోవైపు సిన్సియర్‌గా పని చేసే డిజిపిని (సాయికుమార్‌) టీజ్‌ చేస్తుంటాడు. పోలీసులంటే పడని రాజకీయ నాయకుడు జి.కె. (అశుతోష్‌ రాణా) చేసే అకృత్యాలకి కూడా ఊతమిస్తుంటాడు. కరప్ట్‌ ఆఫీసర్‌ అయిన కళ్యాణ్‌ సిన్హా తనని తాను ఎలా కరెక్ట్‌ చేసుకుంటాడు, జీకేకి ఎలా బుద్ధి చెప్తాడు? 

కళాకారుల పనితీరు:

కళ్యాణ్‌రామ్‌ ఇందులో తన సహజ శైలికి భిన్నంగా కామెడీ చేయడానికి చూసాడు కానీ విలన్‌ని ఢీకొట్టే సీన్స్‌లో చాలా కంఫర్టబుల్‌గా అనిపించాడు. హీరోయిజమ్‌పై బేస్‌ అయిన కథ అయినా కానీ తన వరకు ఎక్కడా తడబడకుండా పాత్రకి అనుగుణంగా నటించి బాగా స్కోర్‌ చేసాడు. కథ ఇచ్చే నమ్మకంతో ఒక నటుడిలో కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ ఏ లెవల్‌లో పెరిగిపోతాయనేది ఇందులో కళ్యాణ్‌ రామ్‌ని చూసి తెలుసుకోవచ్చు. 

Watch Patas Movie Public Talk

హీరోయిన్‌ శృతి సోది అస్సలు ఆకట్టుకోలేదు. ఆమెకి ఎట్రాక్టివ్‌ ఫేస్‌ లేదు, ఎక్స్‌ప్రెషన్స్‌ అసలే పలకలేదు. హీరోయిన్‌ని బేస్‌ చేసుకుని ఒక ఫన్నీ ట్రాక్‌ ఉన్నప్పుడు కాస్త నటన తెలిసిన అమ్మాయిని ఎంచుకుని ఉండాల్సింది. సాయి కుమార్‌కి ఉన్న స్క్రీన్‌ టైమ్‌ తక్కువే అయినా ఇంటర్వెల్‌కి ముందు ఒక మంచి సీన్‌ పడింది. తన క్యారెక్టర్‌కి సాయికుమార్‌ పూర్తి న్యాయం చేసాడు. అశుతోష్‌ రాణా క్యారెక్టర్‌ రొటీన్‌ విలన్ల మాదిరిగానే ఉంది. కొత్తదనమేం లేదు. 

‘సునామీ స్టార్‌’ సుభాష్‌గా ఎమ్మెస్‌ నారాయణ అక్కడక్కడా మెరిస్తే, జయప్రకాష్‌రెడ్డి కూడా కనిపించిన రెండు సీన్లలో తనదైన శైలిలో నవ్వించాడు. శ్రీనివాసరెడ్డి తన అద్భుతమైన టైమింగ్‌తో ఫస్ట్‌ హాఫ్‌ని ఓన్‌ చేసేసుకున్నాడు. తొలి గంటలో కామెడీ మొత్తం శ్రీనివాసరెడ్డి పంచ్‌లు, రియాక్షన్స్‌పైనే బేస్‌ అయింది. పోసాని కృష్ణమురళి తనకి మాత్రమే సాధ్యమయ్యే రీతిలో కామెడీ పండించాడు. ప్రాచీ థక్కర్‌ ఫర్వాలేదనిపించింది. 

సాంకేతిక వర్గం పనితీరు:    

సంగీతం ఆకట్టుకోదు. పాటల్లో ఏదీ ఆకట్టుకోదు. ‘రౌడీ ఇన్స్‌పెక్టర్‌’లోని రీమిక్స్‌ సాంగ్‌తో నందమూరి ఫాన్స్‌ కనెక్ట్‌ కావచ్చు కానీ ఆ రీమిక్స్‌ కూడా సరిగా చేయలేదు. నేపథ్య సంగీతం కూడా సోసోగా ఉంది. స్టాండర్డ్‌ కమర్షియల్‌ సినిమాలకి తగ్గట్టుగానే సినిమాటోగ్రఫీ ఉంది. చెప్పుకోతగ్గ ప్రత్యేకతలేం లేవు. సినిమా వేగం మందగించకుండా, అవసరం లేని సన్నివేశాలు ఎక్కువ లేకుండా ఎడిటింగ్‌ బాగా కుదిరింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

Watch Patas Movie Public Talk

దర్శకుడిగా తొలి సినిమా అయినా కానీ అనిల్‌ రావిపూడి తనకి మాస్‌ పల్స్‌ బాగా తెలుసని ప్రూవ్‌ చేసుకున్నాడు. ఫస్టాఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, సెకండాఫ్‌ యాక్షన్‌ అండ్‌ ఎమోషన్‌ అన్నట్టుగా డివైడ్‌ చేసుకుని ఫార్ములాకి తగ్గ కథనం రాసుకున్నాడు. లైటర్‌వీన్‌లో సాగుతున్న కథని పకడ్బందీగా మూడ్‌ మార్చి హై వోల్టేజ్‌ యాక్షన్‌ సినిమాగా మలిచాడు. ఆ తర్వాత కూడా వినోదానికి లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకుని టోటల్‌గా ఒక కంప్లీట్‌ కమర్షియల్‌ సినిమాని తీర్చిదిద్దాడు. 

హైలైట్స్‌:

  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • హీరో-విలన్‌ ఛాలెంజ్‌ చేసుకునే సీన్స్‌
  • వేగవంతమైన కథనం

డ్రాబ్యాక్స్‌:

  • సాంగ్స్‌
  • హీరోయిన్‌
  • క్లైమాక్స్‌

విశ్లేషణ:

రొటీన్‌ కథనే తీసుకుని ఆకట్టుకునేలా చెప్పడమే కమర్షియల్‌ సినిమా దర్శకులకి మాత్రమే తెలిసిన ఆర్టు. సరికొత్త కథాంశం కానీ, కథనం కానీ లేకుండానే… రొటీన్‌ ఎలిమెంట్స్‌తో రెగ్యులర్‌ సినిమా తీసి మెప్పిస్తుంటారన్న మాట. సగటు సినీ ప్రియుడికి కావాల్సిన అన్ని అంశాలు సరైన డోస్‌లో పడితే.. అన్నీ సరిగ్గా కుదిరితే, ఎన్నిసార్లు చూసిన కథనైనా మళ్లీ ఇంకోసారి చూడ్డానికి ఏం కంప్లయింట్స్‌ ఉండవు. కాకపోతే ఇందుకోసం ఫార్ములాని క్షుణ్ణంగా అధ్యయనం చేసి… గ్రాఫ్‌ని ఎలా మెయింటైన్‌ చేయాలో, పేస్‌ ఎంత కన్సిస్టెంట్‌గా ఉంచాలో తెలిసుండాలి. కమర్షియల్‌ సినిమా తీసే ఆర్టు తన దగ్గర బాగా ఉందని యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి చాటుకున్నాడు. 

పక్కదారి పట్టిన పోలీసు.. తన తప్పు తెలుసుకుని దుష్టులకి బుద్ధి చెప్పడమనే పరమ రొటీన్‌ పాయింట్‌తో రూపొందిన ‘పటాస్‌’ని అల్లాటప్పాగా తీస్తే తుస్‌మనేసేది. కానీ దర్శకుడు అనిల్‌ రావిపూడి తన మామూలు కథని వినోదాత్మకంగా చెప్పడంలో సక్సెస్‌ అయ్యాడు. కామెడీ ప్రధానంగా సాగిపోతున్న చిత్రం ఇంటర్వెల్‌ దగ్గరకు వచ్చేసరికి సీరియస్‌గా మారుతుంది. అంతవరకు తను చేసే బాధ్యతాయుత ఉగ్యోగాన్ని తేలిగ్గా తీసుకుంటూ కనిపించిన హీరో ఆ తర్వాత తన యూనిఫామ్‌ పవరేంటో చూపిస్తాడు. ఈ క్రమంలో కావాల్సినంత ఎమోషన్‌ పండింది. హీరో ఎలివేషన్‌ సీన్స్‌ తప్పకుండా టార్గెట్‌ ఆడియన్స్‌ని అమితంగా అలరిస్తాయి. 

Watch Patas Movie Public Talk

సాయికుమార్‌-కళ్యాణ్‌రామ్‌ మధ్య మరికాస్త ఎమోషన్‌ పండించినట్టయితే ఈ కమర్షియల్‌ సినిమాకి పరిపూర్ణత వచ్చేది. అలాగే హీరోయిన్‌ ట్రాక్‌ కాసేపు వినోదానికి వాడుకున్నారు కానీ తర్వాత సైడ్‌ ట్రాక్‌ అయింది. ఇలాంటి చిన్న చిన్న గ్యాప్స్‌ని కూడా ఫిల్‌ చేసినట్టయితే ‘పటాస్‌’ ఇంకా బాగా పేలి ఉండేది. వినోదం ఎక్కడా మిస్‌ అవకపోవడం, కథనం వేగంగా పరుగులు తీయడం దీనికి పెద్ద ప్లస్‌ పాయింట్స్‌గా నిలిచాయి. క్లయిమాక్స్‌ని మరీ సింపుల్‌గా తేల్చేసినట్టు అనిపిస్తుంది. లాస్ట్‌ సీన్‌లో ఉండాల్సినంత ఎమోషన్‌ లేకపోవడం ఖచ్చితంగా లోటే. ఇంటర్వెల్‌ ముందు నుంచి, ఇంటర్వెల్‌ తర్వాత ఒక నలభై నిముషాల వరకు సినిమా గ్రాఫ్‌ టాప్‌ లెవల్‌లో ఉంటుంది. అదే ఈ చిత్రానికి మెయిన్‌ హైలైట్‌గా నిలిచింది. మాస్‌ మసాలా సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులని ‘పటాస్‌’ శాటిస్‌ఫై చేస్తుంది. అలాగే నందమూరి అభిమానులకి కావాల్సిన అంశాలని కూడా అనిల్‌ రావిపూడి మర్చిపోకుండా జోడించాడు. దాదాపుగా అందరు నందమూరి ప్రముఖలు రిఫరెన్సులున్నాయి. ఇక ఈ పక్కా కమర్షియల్‌ చిత్రాన్ని ఏ రేంజ్‌కి తీసుకెళ్తాడనేది కళ్యాణ్‌ రామ్‌ సత్తాపై ఆధారపడి ఉంది. 

బోటమ్‌ లైన్‌: ఫుల్‌ టైమ్‌ పాస్‌!

గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri