రామ్ చరణ్ ను చూసి నేర్చుకోవాలి

సినిమాలు విడుదల చేయడం అంటే రామ్ చరణ్ తరువాతే. ప్రతి సినిమా టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు సాగిస్తాయి అంటే విడుదల టైమ్ కూడా ఓ కారణం. కానీ ఎన్టీఆర్ అలాంటివి అస్సలు…

సినిమాలు విడుదల చేయడం అంటే రామ్ చరణ్ తరువాతే. ప్రతి సినిమా టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు సాగిస్తాయి అంటే విడుదల టైమ్ కూడా ఓ కారణం. కానీ ఎన్టీఆర్ అలాంటివి అస్సలు పట్టించుకున్నట్లు కనిపించదు. 

చిరుత, గోవిందుడు అందరివాడేలే దసరా ముందు, మగధీర, రచ్చ వేసవిలో, నాయక్, ఎవడు సంక్రాంతి సీజన్ లో విడుదలయ్యాయి. క్లీన్ బౌల్డ్ అయిన ఆరెంజ్ నవంబర్ లో విడుదల కావడం గమనార్హం. సినిమా విజయానికి, వసూళ్లకు సీజన్ కూడా కీలకపాత్ర వహిస్తుంది.

 ఏదో బాధపడి టెంపర్ ను సంక్రాంతికి తీసుకు వచ్చి వుంటే బాగుండేది. ఇప్పుడు అన్ సీజన్ అని అనుకునే ఫిబ్రవరిలో అదీ, వరల్డ్ కప్ ముందు తెస్తున్నారు. టాక్ ఎలా వుంటుందో, ఫలితం ఎలా వుంటుందో చూడాలి మరి.