వెంకటేష్ కంప్లీట్‌గా కమర్షియల్ సినిమాలకి అతీతంగా భిన్నమైన చిత్రాలు చేస్తూ మంచి ఫలితాలు సాధించడం చూసిన నాగార్జున కూడా అలాంటి ఎటెంప్ట్ చేయాలని అనుకుంటున్నాడో ఏమో కానీ తన తదుపరి చిత్రంలో నాగార్జున ఓ భయానక వ్యాధిగ్రస్తుడి పాత్రలో కనిపించబోతున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి. కార్తీతో కలిసి నాగార్జున చేసే వంశీ పైడిపల్లి చిత్రం ఓ ఫ్రెంచ్ డార్క్ కామెడీకి రీమేక్ అని ప్రచారం జరుగుతోంది.
‘ది ఇన్‌టచబుల్స్’ అనే ఆ చిత్రంలో క్వాడ్రిప్లెజిక్ పేషెంట్ అయిన ధనవంతుడికీ, అతని కేర్ టేకర్‌కీ మధ్య జరిగే డ్రామా హైలైట్‌గా నిలుస్తుంది. ఆ సినిమానే ఇప్పుడు నాగ్, కార్తీతో తీస్తున్నారని, ఇందులో నాగార్జున పేషెంట్ పాత్ర చేస్తున్నాడని, కార్తీ కేర్ టేకర్‌గా నటిస్తాడని చెబుతున్నారు. ఇంతవరకు దీని గురించి వంశీ పైడిపల్లి లేదా హీరోలు ఏం మాట్లాడలేదు.
కానీ ఎలా బయటకి పొక్కిందో, లేదా ఎక్కడ్నుంచి పుట్టుకొచ్చిందో కానీ సోషల్ మీడియాలో ఈ గాసిప్ బాగా స్ప్రెడ్ అవుతోంది. మరి మన్మథుడు నాగ్.. తన ఇమేజ్‌కి భిన్నంగా ఇంతటి రిస్కు చేయడానికి సాహసిస్తాడంటారా? కార్తీకి ముందు ఈ కథని ఎన్టీఆర్‌కి చెప్పిన వంశీ పైడిపల్లి ఇలాంటి కథతో ఎన్టీఆర్‌ని అప్రోచ్ అయ్యాడంటారా?