అయ్యో ‘రాధ‌’.. క‌థ కొట్టేశాడా??

మారుతిపై మ‌రో మ‌చ్చ‌!  బూతు సినిమాలు తీసి, సొమ్ములు చేసుకొంటున్నాడ‌న్న అప‌వాదు ఉండ‌నే ఉంది. ఇప్పుడు కాపీ ద‌ర్శకుడిగానూ ముద్ర వేసుకొంటున్నాడు. సంగ‌తేంటంటే.. మారుతి – వెంక‌టేష్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కనున్న చిత్రం రాధ‌. ఈ…

మారుతిపై మ‌రో మ‌చ్చ‌!  బూతు సినిమాలు తీసి, సొమ్ములు చేసుకొంటున్నాడ‌న్న అప‌వాదు ఉండ‌నే ఉంది. ఇప్పుడు కాపీ ద‌ర్శకుడిగానూ ముద్ర వేసుకొంటున్నాడు. సంగ‌తేంటంటే.. మారుతి – వెంక‌టేష్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కనున్న చిత్రం రాధ‌. ఈ క‌థ మారుతిది కాద‌ట‌. 

మారుతి ద‌గ్గర ప‌నిచేసిన ఓ స‌హాయ ద‌ర్శకుడు వెంక‌టేష్ కోసం రాసుకొన్న క‌థ‌. దాన్ని మారుతి త‌న‌దిగా చెప్పుకొని – వెంకీకి వినిపించాడు. ఆ సంగ‌తి తెలిసిన ఆ అసిస్టెంట్ అవాక్కయి.. ఇదేం న్యాయం మారుతీ..??  అని నిల‌దీశాడు. ఆ త‌ర‌వాత పెద్దల స‌మ‌క్షంలో త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని బ‌య‌ట‌పెట్టాడ‌ట‌. 

ఇండస్ట్రీ మూల స్థంభంగా చెప్పుకొనే ఓ పెద్దాయ‌న ఈ స‌మ‌స్యను 'డ‌బ్బు'తో కొట్టి ప‌రిష్కరించాడ‌నే టాక్ వినిపిస్తోంది. ఇది నిజమేనా..??  లేదంటే మారుతి అంటే ప‌డ‌క‌, ప‌బ్లిసిటీ కోసం ఆ స‌హాయ ద‌ర్శకుడు చేసుకొంటున్న ఉత్తుత్తి ప్రచార‌మా..??  ఏమో.. మ‌రి. ఇందులో ఉన్న నిజానిజాలేమిటో మారుతికీ, ఆ పెద్దాయ‌న‌కే తెలియాలి.