బన్నీకి ఇంకా కథ చెప్పలేదు

‘బలుపు’తో ఘన విజయం అందుకున్న తర్వాత దర్శకుడు గోపీచంద్‌ మలినేని మలి చిత్రం అల్లు అర్జున్‌ హీరోగా ఉంటుందని ప్రచారం జరిగింది. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తాడని కూడా న్యూస్‌ వచ్చింది. అయితే…

‘బలుపు’తో ఘన విజయం అందుకున్న తర్వాత దర్శకుడు గోపీచంద్‌ మలినేని మలి చిత్రం అల్లు అర్జున్‌ హీరోగా ఉంటుందని ప్రచారం జరిగింది. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తాడని కూడా న్యూస్‌ వచ్చింది. అయితే ఆ ప్రాజెక్ట్‌ ఉందో లేదో అనేది స్పష్టం కాక ముందే అల్లు అర్జున్‌ తన తదుపరి చిత్రం ఏది చేయాలనేది ఫిక్స్‌ అయ్యాడు. 

అత్తారింటికి దారేది తర్వాత త్రివిక్రమ్‌ తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్‌తో చేద్దామని నిర్ణయించుకునేసరికి స్టయిలిష్‌ స్టార్‌ ఇమ్మీడియట్‌గా ఓకే చేసాడు. మరి అతని కోసం కథ తయారు చేస్తున్న గోపీచంద్‌ మలినేని ప్రాజెక్ట్‌ సంగతేంటి? బన్నీ కోసం గోపీచంద్‌ కథ సిద్ధం చేసేశాడు. ఇంకా హీరోకి, అల్లు అరవింద్‌కి వినిపించలేదు. 

త్వరలోనే మలినేని, దిల్‌ రాజు వెళ్లి కథ చెప్పబోతున్నారు. అల్లు అరవింద్‌, అర్జున్‌ దీనిని ఓకే చేసినట్టయితే త్రివిక్రమ్‌ సినిమాతో పాటు సైమల్టేనియస్‌గా ఈ చిత్రం కూడా స్టార్ట్‌ చేస్తాడని న్యూస్‌. సింగిల్‌ సిట్టింగ్‌లో కథ ఓకే అయ్యే విధంగా పకడ్బందీ స్క్రిప్ట్‌తో బన్నీని కలవడానికి సిద్ధంగా ఉన్నాడు మలినేని గోపీచంద్‌.