మీడియా కూడా లైట్ తీసుకున్న ‘బ్రేకప్’

తన బ్రేకప్ పై ఇప్పటికే ఆమె పరోక్షంగా పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చేసింది. భాగస్వామిని ఎంచుకునేముందు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ ఉచిత క్లాసులు కూడా ఇచ్చేసింది

బ్రేకప్ తర్వాత మీడియా ముందుకు రావడం హీరోహీరోయిన్లకు చాలా కష్టం. అసలు విషయం వదిలేసి, ప్రశ్నలన్నీ బ్రేకప్ గురించే అడుగుతుంటుంది మీడియా. తమన్న విషయంలో మాత్రం అది జరగలేదు.

విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత పూర్తిస్థాయిలో మీడియా ముందుకొచ్చింది మిల్కీబ్యూటీ. తన కొత్త సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆమె పలు ప్రాంతాల్లో పర్యటిస్తోంది. అయితే ఆశ్చర్యంగా మీడియా మాత్రం తమన్నాను బ్రేకప్ గురించి ప్రశ్నించడం లేదు.

తన బ్రేకప్ పై ఇప్పటికే ఆమె పరోక్షంగా పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చేసింది. భాగస్వామిని ఎంచుకునేముందు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ ఉచిత క్లాసులు కూడా ఇచ్చేసింది. సో.. తమన్నానే ఓపెన్ అయిన తర్వాత, ఇక బ్రేకప్ గురించి ప్రత్యేకంగా ప్రశ్నించడానికేం లేదు.

కాకపోతే, ఎందుకు వాళ్లిద్దరూ విడిపోయారనే విషయాన్ని తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. అది మాత్రం వాళ్లు చెప్పరు. విడిపోయినా తామిద్దరం మంచి స్నేహితులమే అని కవర్ చేసుకుంటారు. అదీ సంగతి.

4 Replies to “మీడియా కూడా లైట్ తీసుకున్న ‘బ్రేకప్’”

  1. అందరికీ ముందే తెలుసు… అయినా ఒకటిన్నర సంవత్సరం డేటింగ్ చేసుకున్నాడు హాయిగా… ఇంకేం కావాలి సామీ విజయ వర్మ కు??

Comments are closed.